iDreamPost

మాల్దీవులకు భారత్ చేసిన సాయం ఏంటి?

మాల్దీవులకు భారత్ చేసిన సాయం ఏంటి?

పాకిస్తాన్ కు ఏదైనా సమస్య వస్తే భారత్ ను సాయం కోరుతుందా?.. ఒకవేళ కోరితే మనదేశం సాయం చేస్తుందా.. చేసిన సాయానికి పాకిస్తాన్ ధన్యవాదాలు తెలుపుతూ మనదేశానికి నమస్కరిస్తుందా.. ఇవన్నీ సాధ్యం కాదు అన్నట్టుగా ఉందా.. అయితే ఇలాంటి ఘటనే ప్రస్తుత కరోనా ప్రభావంతో జరిగింది. అయితే పాకిస్తాన్ తో కాదు.. మాల్దీవులతో.. మరి పాకిస్తాన్ కు మాల్దీవులకు లింకేంటి అనుకుంటున్నారా.. అయితే చూడండి..

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు మానవతావాద దృక్పథంతో మనదేశం వైద్యపరమైన సహాయం చేసింది. అత్యవసర మందులను, వైద్యుల బృందాన్ని పంపించింది. మూడు నెలలకు సరిపడిన మందులు, ఆహారాన్ని విరాళంగా ఇచ్చినందుకు మన దేశానికి మాల్దీవులు ధన్యవాదాలు తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడు అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ కూడా ధన్యవాదాలు తెలిపారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మాల్దీవులకు ఆహారం, మెడిసిన్ ఇచ్చినందుకు భారతదేశ జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు

మాల్దీవులు అంటే కేవలం అందమైన దీవులు మాత్రమేనని, టూరిజానికి మాత్రమే మాల్దీవులు బావుంటాయని తప్ప మాల్దీవులకు మన దేశానికి ఉన్న దశాబ్ధాల నాటి సంబంధం గురించి చాలామందికి తెలియదు. మరిముఖ్యంగా మాల్దీవులు మనకు పాకిస్తాన్ తర్వాత అంతటి శత్రుత్వం ఉన్న దేశం (ఈ పదేళ్లలో కాదు) అని కూడా చాలామందికి తెలియదు.. అయినా మాల్దీవులకు భారత్ ఎంతో ఉపకారం చేసింది. దశాబ్ధాల కాలం నుండి చేస్తూనే ఉంది..

తాజాగా కరోనా నిమిత్తం చేసిన సహాయానికి మాల్దీవులు ఏకంగా సార్క్ లోనే భారత్ ను కొనియాడింది. ఆదివారం కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్ఘనిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనూ మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ ‘కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో భాగంగా సార్క్‌ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపించిన ప్రధాని మోడికి కృతజ్ఞతలు. మాల్దీవులకు సహాయం చేసేందుకు భారత్‌ ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, భారత ప్రజలకు, మోడీకి మా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలముందు మన దేశాన్ని కొనియాడారు.

అయితే పూర్తిగా ఇస్లామిక్ దేశం, భారత్ తో విరుద్ధ భావాలు కలిగి శత్రుదేశంగా వ్యవహరిస్తున్న మాల్దీవులు గతంలో మన నుండి అనేకసార్లు సాయం పొందింది. అధ్యక్షులు మారినప్పుడల్లా మనతో వాళ్ళ సంబంధాలు మారిపోయేవి,కొన్ని సార్లు స్నేహం కొన్నిసార్లు దూరం అన్నట్లు ఉండేది.

1965 లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన మాల్దీవులకు 1988లో తొలి సంక్షోభం తలెత్తింది. అబ్ధుల్లా లతీఫ్ మరియు అహ్మద్ నాసిర్ అనే ఇద్దరు వ్యాపారులు తమిళ తిరుబాటు వర్గాల కిరాయి సైనికులతో రాజధానిపై దాడిచేసి అధ్యక్షుడు గయూం భవనాన్ని స్వాదీనం చేసుకుని దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గయూం తప్పించుకుని భారత్, అమెరికా, బ్రిటన్ సహాయ అర్ధించారు. వెంటనే అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ 24 గంటల్లోనే 16వేలమంది సైనికులను మాల్దీవులకు పంపించి గయూం ప్రభుత్వాన్ని పునఃరుద్దరించారు.

2008లో జరిగిన ఎన్నికల్లొ గయూం పార్టిని ఓడించి నషీద్ మాల్దీవుల అధ్యక్షుడయ్యారు. 2012లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్ధుల్లా యమీన్ తిరుగుబాటు చేసి నషీదును పదవి నుంచి తొలగించి అధ్యక్షుడవటంతో మాల్దీవుల్లో నియంతృత పాలన మొదలైంది.

అధ్యక్షుడు యామీన్ ధోరణిని నిరసిస్తు 12 మంది పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష పార్టిలోకి ఫిరాయించారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో పార్టి ఫిరాయించిన 12మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించి, తన ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర చేస్తున్నారన్న అభియోగంతో 9 మంది ప్రతిపక్ష నాయకులను అధ్యక్షుడు యామీన్ అరెస్ట్ చేయించాడు. ప్రతిపక్షం సుప్రీంకోర్టుకు వెళ్ళగా 12మంది పార్లమెంటు సభ్యుల పై అనర్హత ఎత్తివేసి, నాయకులను జైలునుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను దిక్కరించి 15 రోజులు దేశంలో ఎమర్జెన్సి విధించారు. సుప్రీం న్యాయమూర్తులను ప్రతిపక్ష నాయకుల్ని, జీ అధ్యక్షుడు గయూంను అరెస్టు చేయించాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నషీద్ భారత్ సహాయాన్ని కోరగా మన ప్రభుత్వం మాల్దీవులకు సైన్యాన్ని పంపడానికి, అవసరమైన సాయం చేయడానికి సిద్ధమైంది.

వాస్తవానికి చైనాకు, మాల్దీవులకు సత్సంబంధాలున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా చైనా మాల్దీవుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. చైనాతో స్వేచ్చా వ్యాపార ఒప్పందం చేసుకున్న మాల్దీవులు చైనాకు ఏకంగా కొన్ని దీవులపై ఆధిపత్యమిచ్చేస్తూ చట్టాలను మార్చారు. చైనా నిర్మిస్తున్న (One Belt & Maritime Silk Road) ప్రాజెక్టులో మాల్దీవులు భాగస్వామ్యంగా ఉంది. ఇది భారత్ కు నష్టాన్ని కలిగించే అంశమే అయినా భారత్ మాల్దీవుల అభివృద్ధికి సహకరిస్తూ వస్తోంది.

గతంలో ప్రధాని మోడీ 10,026 కోట్ల రూపాయలు (1.4 బిలియన్ డాలర్లు) సాయం ప్రకటించారు. ఢిల్లీకి వచ్చిన ప్రధానితో మాల్దీవుల అధ్యక్షడు మహమ్మద్ ఇబ్రహీం సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. హిందూ మహాసముద్రంలో భద్రత విషయంలో రెండు దేశాలు అంగీకరించాయి. తర్వాత కూడా మోడి మాల్దీవులపై ప్రేమ చూపించారు. రెండవసారి ప్రధాని అయ్యాక తన మొదటి అధికారిక విదేశీ పర్యటనకు మాల్దీవులనే ఎంచుకున్నారు. ఇలా మాల్దీవులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇందుకు కారణం లేకపోలేదు.. దక్షిణ ఆసియా, అరేబియా మహా సముద్రంలో మాల్దీవులు ఒక వ్యూహాత్మక సముద్రప్రాంతం.. భారత్ కు ఇప్పుడు గతంలోకంటే ఇప్పుడు ఈ ప్రాంతం చాలా కీలకం..

మాల్దీవులు మన నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీలో అతి పెద్ద భాగం. మనకు మధ్యప్రాచ్యం నుంచి ఎంత చమురు, గ్యాస్ ఎక్స్ పోర్ట్ అవుతుందో అందులో ఒక పెద్ద భాగమైన ‘ఎ’ డిగ్రీ ఛానల్ మాల్దీవుల పక్కనుండే వస్తోంది. అందుకే భారత్ మాల్దీవుల్లో ఒక నమ్మకమైన డెవలప్మెంట్ పార్టనర్ పాత్రను పోషిస్తూ వస్తోంది. మోడి తన మొదటి విదేశీ పర్యటనకు మాల్దీవులను ఎంచుకోవడం వెనుక చైనాకు చెక్ పెట్టడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. చైనా గత కొన్నేళ్లనుండి హిందూ మహా సముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దాంతో చైనా దృష్టి మాల్దీవులపై పెట్టింది. వాణిజ్యం, ఆర్థిక సాయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చైనా మాల్దీవుల్లో వేగంగా అడుగులు మోపింది. ఫలితంగా 2013 నుంచి 2018 వరకూ అక్కడి అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టింది. వీటిలో అతి ముఖ్యమైనది మాల్దీవులు చైనాకు దగ్గరవ్వడమే. మనతో మనతో సంబంధాలు దాదాపుగా తెంచుకుని చైనాకు దగ్గరవ్వడం వలంల హిందూ మహా సముద్రం జలరవాణాపై చైనా ఆదిపత్యానికి ప్రత్యక్షంగా సహకరించింది.

దీనికి ప్రతిగా అలాగే చైనా నిర్మిస్తున్న మారిటైం సిల్క్ రోడ్ లో భాగంగా మాల్దీవుల్లో కొత్త నౌకాశ్రయాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం హిందూ మహా సముద్ర మార్గలో నిత్యం 40 మిలియ బ్యారెల్లకుపైగా చమురు రవాణా జరుగుతోంది. ఇతర వాణిజ్య రవాణా కూడా చాలా ఎక్కువ. యూరప్ నుంచి ఆస్ట్రేలియా మధ్య జలరవాణాపై ఆధిపత్యమే చైనా లక్ష్యంగా చైనా ముందుకు సాగుతుండగా మాల్దీవుల్లో 2018 ఎన్నికల్లో అధికారం మారింది. వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త అధ్యక్షుడు ఇబ్రహీమ్ మొహమ్మద్ సోలిహ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి దౌత్య సందేశమిచ్చారు. అనంతరం మాల్దీవుల అభివృద్ధికి నిధులిచ్చారు. దానికి బదులుగా మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ గతేడాది డిసెంబర్‌లో మనదేశంలో అధికారిక పర్యటన చేసారు. అప్పటినుంచి భారత్ తో మాల్దీవులు సత్సంబంధాలు కలిగి ఉంటోంది. ప్రస్తుత సాయానికి మాత్రం మాల్దీవులు శిరస్సు వంచి నమస్కరిస్తోంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి