iDreamPost

OTT Movie: ఒకేసారి రెండు OTTల్లోకి 1500 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Apr 17, 2024 | 11:38 AMUpdated Apr 17, 2024 | 11:38 AM

ఓటీటీ లో వచ్చే అనేక సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆంతర్జాతీయ సినిమాలకు సిరీస్ లకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక అడ్వెంచరస్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది.

ఓటీటీ లో వచ్చే అనేక సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆంతర్జాతీయ సినిమాలకు సిరీస్ లకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక అడ్వెంచరస్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది.

  • Published Apr 17, 2024 | 11:38 AMUpdated Apr 17, 2024 | 11:38 AM
OTT Movie: ఒకేసారి రెండు OTTల్లోకి  1500 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఒకప్పుడు సినిమాలంటే కేవలం థియేటర్స్ మాత్రమే గుర్తొచ్చే సినీ ప్రియులకు.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గుర్తొస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే ఏ సినిమానో సిరీస్ ఓ చూస్తూ గడిపేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. హీరో హీరోయిన్స్ మిగిలిన యాక్టర్స్ తో సంబంధమే లేదు. కథ బావుంటే చాలు .. వాటికి విశేష ఆదరణ లభించేస్తుంది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్ -2 ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విశేషాలను చూసేద్దాం.

డ్యూన్ పార్ట్ -2 సినిమాను దాదాపు రూ.1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మార్చి 1 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. 2024లో హాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన వసూళ్లు దాదాపు రూ.4500 కోట్లు. కాగా, ఈ సినిమాకు డేనిష్ విల్లేన్యువే దర్శకత్వం వహించారు. లెజెండరీ పిక్చర్స్ వార్నర్ బ్రదర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాను 2021 లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్ సినిమాకు.. సిక్వెల్ గా పార్ట్-2 ను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు, బుక్ మై షో లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక డ్యూన్ కథ విషయానికొస్తే.. డ్యూన్ క‌థ‌ను ఒక విజువ‌ల్ వండ‌ర్‌గా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప‌దివేల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎం జరగబోతుంది. అనే కథను దృష్టిలో ఉంచుకుని.. గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ఈ స్టోరీ కొనసాగుతోంది. ఎట్రాడిస్ వంశాన్ని నాశ‌నం చేసిన శ‌త్రువుల‌పై పాల్ అనే యువ‌కుడు ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు. ఈ పోరాటంలో ఫ్రిమెన్స్ అనే ప్లానెట్ వారు పాల్‌కు ఎందుకు సాయం చేశారు? వారిని దేవుడిగా ఫ్రీమెన్స్ ఎలా న‌మ్మారు! అని ఓ నాలుగు ప్లానెట్స్‌ చుట్టూ ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ పై ఇంట్రెస్ట్ కలిగిన వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి