iDreamPost

TCS కు షాక్.. కార్మిక శాఖ నుండి నోటీసులు

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో తోడు పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలన్నీ తమ ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నాయి. అలాగే నియామకాలు చేసిన ఉద్యోగులను కూడా వెయిటింగ్ లిస్టులో ఉంచుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో తోడు పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలన్నీ తమ ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నాయి. అలాగే నియామకాలు చేసిన ఉద్యోగులను కూడా వెయిటింగ్ లిస్టులో ఉంచుతున్నాయి.

TCS కు షాక్.. కార్మిక శాఖ నుండి నోటీసులు

ఇటీవల కాలంలో ప్రతి కంపెనీ.. ఉద్యోగులను తగ్గించే పనిలో పడింది. ముఖ్యంగా ఐటి సంస్థలు.. తమ ఎంప్లాయిస్‎ను ఇంటికి పంపించేస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రో సాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలే లే ఆఫ్స్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో తోడు పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. అలాగే నియమకాలు చేపట్టి.. ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారు. ఆన్ బోర్డింగ్ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు రిక్రూటర్స్. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని సందేహంలో బతుకుతున్నారు. ఈ విషయంపైనే ప్రముఖ దేశీయ దిగ్గజ సంస్థ టీసీఎస్‌కి నోటీసులు జారీ అయ్యాయి.

టీసీఎస్‌కి భారీ షాక్ తగిలింది. 200 మంది లేటరల్ రిక్రూట్(మరో కంపెనీలో ఇదే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగుల నియామకం)ల ఆన్ బోర్డింగ్ ఆలస్యం చేసిందన్న ఫిర్యాదుపై మహారాష్ట్ర కార్మిక శాఖ సదరు సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉద్యోగుల ఆన్ బోర్డింగ్ చేయడంలో జాప్యం జరిగిందంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) గత జులైలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయగా.. ఆ శాఖ.. మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. వివిధ హోదాల్లో అనుభవజ్జులైన నిపుణులు ఆన్ బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని టీసీఎస్ కు నిర్ధిష్ట ఆదేశాలు జారీ చేయాలని కార్మిక శాఖను కోరింది.

1.8 ఏళ్ల నుండి 15 సంవత్సరాల వరకు వివిధ స్థాయిల్లో అనుభవమున్న ఉద్యోగులు.. ఆన్ బోర్డింగ్ చేయకపోవడంతో ఆదాయ వనరులు సమకూరకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దీనిపై నోటీసులు జారీ చేసిన కార్మిక శాఖ.. నవంబర్ 2న పుణె కార్మిక శాక కార్యాలయంలో డిపార్ట్ మెంట్ అధికారులతో సమావేశమై చర్చించాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం టాలెంట్ పూల్ ను వినియోగాన్ని మెరుగుపరుస్తున్నందున నియామకాలపై నెమ్మదిగా వెళుతున్నట్లు టీసీఎస్ పేర్కొంటోంది. ఈ లేటరల్ రిక్రూట్‌లను జనవరి, ఏప్రిల్‌లో నియమించుకుంది టీసీఎస్. ఇప్పటి వరకు ఆన్ బోర్డింగ్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తుంది. తొలుత జులై 10 జాయినింగ్ తేదీలు ఇచ్చి.. ఇప్పుడు అక్టోబర్ కు వాయిదా వేసినట్లు మెయిల్స్ పంపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి