iDreamPost
android-app
ios-app

గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు!

గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు!

ఇటీవల తెలంగాణ గ్రూప్-1 పరీక్షలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.  ఈక్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ హైకోర్టు డివిజన్ కి అప్పీల్ చేసింది. దీంతో బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. టీఎస్‌పీఎస్సీ చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది.

ఈ ఏడాది జూన్ 11న తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల సమయంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయలేదని కొందరు అభ్యర్థు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు  గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి..మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

టీఎస్పీఎస్సీ  చేసిన అప్పీల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సీరియస్ కామెంట్స్ చేసింది. టీఎస్సీపీఎస్సీ బోర్డుపై ప్రశ్న వర్షం కురిపించింది. ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? అంటూ ప్రశ్నించింది. అంతేకాక మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా?, లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా అంటూ టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. మరి.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişcasibomMadridbet