iDreamPost
android-app
ios-app

Reality Shows On OTT : శాటిలైట్ నుంచి ఓటిటికి జంప్ చేసిన రియాలిటీ షోలు

  • Published Mar 03, 2022 | 3:11 PM Updated Updated Mar 03, 2022 | 3:11 PM
Reality Shows On OTT : శాటిలైట్ నుంచి ఓటిటికి జంప్ చేసిన రియాలిటీ షోలు

ఇప్పుడు రియాలిటీ షోలు టీవీ ఛానల్స్ నుంచి ఓటిటికు వెళ్తున్నాయి. ఇంటర్వ్యూలు, కుకింగ్ ప్రోగ్రాములు, సెలబ్రిటీ టాక్ షోలు మాత్రమే కాదు ఏకంగా బిగ్ బాస్ లాంటి మోస్ట్ వాంటెడ్ సైతం డిజిటల్ రూటు పట్టాయి. ఇటీవలే హాట్ స్టార్ ఇరవై నాలుగు గంటలు కొనసాగే కొత్త సీజన్ ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికీ నాగార్జునే యాంకరింగ్ చేస్తున్నారు. తొలినాళ్ళలో వ్యూస్ భారీగా వచ్చాయని సరికొత్త రికార్డులు సృష్టించిందని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. ఇక సేమ్ కాకపోయినా ఇలాంటి కాన్సెప్ట్ తో రూపొందిన లాకప్ ఇటీవలే ఎంఎక్స్ ప్లేయర్ తో పాటు ఏఎల్టి బాలాజీ ఓటిటిలో మొదలై నేనేం తీసిపోలేదన్నట్టుగా దూసుకుపోతోంది.

మొదలైన రెండు రోజుల లోపే 15 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించి ఆమ్మో అనిపించేసింది. దీనికి ప్రధాన కారణం ఈ షో ఉచితంగా అందుబాటులో ఉండటమే. జైలు లాంటి వాతావరణంలో పదహారు పార్టిసిపెంట్స్ ని తీసుకొచ్చి  కంగనా రౌనత్ యాంకరింగ్ తో రచ్చ చేస్తోంది. అంతేకాదు లైవ్ లో ఆ లాకప్ సభ్యులతో మాట్లాడే అవకాశం కలిగించడంతో ఇది ప్లాన్డ్ షో కాదనే వాస్తవం ఆడియన్స్ లో నాటుకుపోతోంది. కంగనా పంచులు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముందు ముందు ఇంకా స్పైసీగా ప్రోగ్రాం ఉండబోతోందని, అసలే బూతు కంటెంట్ కి పేరు మోసిన ఏఎల్టి ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీవీ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి శాటిలైట్ ఛానల్స్ కు ఉండే పరిమితులను దాటుకుని ఇప్పుడిలాంటి షోలు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాయి. సెన్సార్ లాంటి వ్యవహారాలు ఉండవు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక మన తెలుగు బిగ్ బాస్ సంగతి చూస్తే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెద్దగా సందడి లేదు కానీ హైప్ ని పెంచే క్రమంలో హాట్ స్టార్ ఏవో ప్లాన్స్ లో ఉన్నట్టు సమాచారం. కాకపోతే గతంలో వచ్చిన పార్టిసిపెంట్స్ నే మళ్ళీ తీసుకురావడం కొంత మైనస్ అవుతోంది కానీ ఇంకొద్ది రోజులు ఆగి చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ ని గట్టిగానే టార్గెట్ చేసిన లాకప్ త్వరలో టీవీ టెలికాస్ట్ కోసం ఇదే కంగనాతో  రంగం సిద్ధం చేసుకుంటోందట.

Also Read : March 4th Releases : అయిదు సినిమాలతో థియేటర్ల సందడి

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş