iDreamPost
android-app
ios-app

Vishal: వరలక్ష్మి నిశ్చితార్థం.. షాకింగ్ కామెంట్స్ చేసిన విశాల్

  • Published Apr 16, 2024 | 9:34 AM Updated Updated Apr 16, 2024 | 9:34 AM

వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు హీరో విశాల్ రియాక్షన్ కోసం ఎదురు చూశారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు..

వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు హీరో విశాల్ రియాక్షన్ కోసం ఎదురు చూశారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు..

  • Published Apr 16, 2024 | 9:34 AMUpdated Apr 16, 2024 | 9:34 AM
Vishal: వరలక్ష్మి నిశ్చితార్థం.. షాకింగ్ కామెంట్స్ చేసిన విశాల్

వరలక్ష్మి శరత్ కుమార్.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లకు మించి క్రేజ్ సంపాదించుకుంది. శరత్ కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో కేవలం హీరోయిన్ పాత్రలే చేసిన ఈ బ్యూటీ.. తర్వాత తనకు సెట్ అయ్యే.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు మళ్లింది. లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది. మంచి పాత్ర అయితే చాలు.. సపోర్టింగ్, విలన్ ఇలా దేన్ని పట్టించుకోకుండా కెరీర్లో దూసుకుపోతుంది.

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్న వేళ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. కొన్ని రోజుల క్రితమే ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది. పైగా వరలక్ష్మిది లవ్ మ్యారేజ్ కావడం విశేషం. ఇక ఈ బ్యూటీ పెళ్లి వార్త తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు విశాల్ రియాక్షన్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే వీరిద్దరు ప్రేమించుకున్నారని.. శరత్ కుమార్ వీరి లవ్ ని అంగీకరించకపోడంతో.. ఇద్దరూ విడిపోయారని.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదని జోరుగా ప్రచారం సాగింది. కానీ వీరిద్దరూ మాత్రం తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చేవారు. ఇలా ప్రచారం జరుగుతుండగానే వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది.

ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మి నిశ్చితార్థంపై స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తర్వలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఈసినిమా ప్రమోషన్ కోసం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు విశాల్. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి.. ఆమెకు రీసెంట్ గా జరిగిన నిశ్చితార్థం గురించి ప్రశ్న ఎదురయ్యింది. అందుకు విశాల్ చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.

వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నందకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు విశాల్. ప్రస్తుతం ఆమె తమిళంతో పాటు.. తెలుగులో కూడా మంచి పాత్రలు చేస్తూ.. కెరీర్ లో దూసుకుపోతుందన్నాడు. టాలీవుడ్ లో కూడా వరలక్ష్మికి మంచి మార్కెట్‌ ఉందని.. హనుమాన్‌లో ఆమె పాత్ర అద్భుతంగా ఉందని ప్రశంసించాడు విశాల్. అంతే కాదు ఆమె చాలా తక్కువ టైమ్ లోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా హ్యాపీగా ఉందని.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెడుతున్నందకు తాను ఎంతో సంతోషిస్తున్నాను అని తెలిపాడు. అంతేకాక ఆమెకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశాడు విశాల్.

తమిళంతో పాటు తెలుగు మార్కెట్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు విశాల్. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 26న ఈ మూవీ విడుదల కాబోతుంది. అటు వరలక్ష్మి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటిస్తూ.. కెరీర్ లో దూసుకుపోతుంది. అలానే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş