iDreamPost
android-app
ios-app

Venkatesh: వెంకటేష్ కుమార్తె రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో తెలుసా..!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో కుమార్తె 'హవ్యవాహిని'కి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా రిసెప్షెన్ ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఐటెమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో కుమార్తె 'హవ్యవాహిని'కి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా రిసెప్షెన్ ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఐటెమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

Venkatesh: వెంకటేష్ కుమార్తె రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో తెలుసా..!

సోషల్ మీడియ రాక ముందు సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు పెద్దగా తెలిసేవి కావు. అయితే దీని పుణ్యమానా అని ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగిన క్షణాల్లో తెలిపి పోతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, శుభకార్యాయాల గురించి తెలుస్తుంటాయి. అందుకే ఇటీవల రిలయన్స్ అధినేత  ముకేశ్ అంబానీ కుమారుడి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో అతిథులకు పెట్టిన భోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరో, విక్టరీ వెంకటే కుమార్తె రిసెప్షన్ లో కూడా అదిరిపోయే వంటకాలు పెట్టారంట.

టాలీవుడ్ హీరో, విక్టరీ వెంకటేశ్ గురించి..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించారు. ముఖ్యంగా లేడిస్ లో వెంకటేస్ కి ఫాలోయింగ్ ఎక్కువ. ఇటీవలే నారప్ప, ఎఫ్3, సైంధవ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. తనదైన మ్యానరిజమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దగ్గుబాటి రామనాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్..తరువాత తనదైన మార్క్ ను చూపించారు. తనకంటే ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక వెంకీ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇటీవలే వారింట పెళ్లి సందడి జరిగింది. ఇటీవలే వెంకటేష్ తన రెండో కుమార్తె ‘హవ్యవాహిని’కి వివాహం జరిపించారు. విజయవాడ డాక్టర్ కుటుంబానికి చెందిన డాక్టర్ నిశాంత్ అనే యువకుడికి వెంకటేశ్ తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక ఈ పెళ్లిని, ఎంగేజ్మెంట్‌ని  వెంకటేశ్ చాలా సింపుల్ గా చేశారు. ఎక్కడ ఎటువంటి హడావుడి లేకుండా, పెద్ద పెద్ద ఈవెంట్, సెలబ్రేషన్స్ లేకుండా వెంకటేష్ తన కుమర్తె వివాహం పూర్తి చేశారు.

ఇక ఈ పెళ్లి అనంతరం రిసెప్షన్ ను వరుడు ఫ్యామిలీ ఇటీవల విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెళ్లి రిసెప్షన్ లో పెట్టిన రకరకాల భోజనాలు కనిపించాయి. ఈ రిసెప్షన్ లో ఇండియన్, కాంటినెంటన్, ఏసియన్, ఇటాలియన్  ఫుడ్స్ కనిపించాయి. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని రకాల వంటకాలతో గుమగుమలాడించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ లో స్పెషల్ డిషెస్ తో అతిథులకు నోరూరించారని తెలుస్తోంది. మరి వెంకటేశ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ లో ఏర్పాటు చేసిన ఆ వంటకాలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

Jojobet GirişmeritbetcasibomKavbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetjojobetjojobet girişmeritkinggalabetjojobetholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel GirişJojobet Giriş