iDreamPost
android-app
ios-app

నితిన్ కామెంట్స్.. మెగా vs అల్లు రచ్చ మళ్ళీ మొదలు?

  • Published Nov 27, 2023 | 2:53 PM Updated Updated Nov 27, 2023 | 2:53 PM

నితిన్‌ నటించిన ‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ ’ సినిమా డిసెంబర్‌ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది.. తాజాగా, నితిన్‌ చేసిన కామెంట్లు...

నితిన్‌ నటించిన ‘ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ ’ సినిమా డిసెంబర్‌ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది.. తాజాగా, నితిన్‌ చేసిన కామెంట్లు...

  • Published Nov 27, 2023 | 2:53 PMUpdated Nov 27, 2023 | 2:53 PM
నితిన్ కామెంట్స్.. మెగా vs అల్లు రచ్చ మళ్ళీ మొదలు?

నితిన్‌ ప్రస్తుతం ‘ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శరా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. డిసెంబర్‌ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. నితిన్‌ ఈ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. తన పాత మూవీల్లోలాగానే పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌గా అలరించనున్నారు. అయితే, తాజాగా, నితిన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుకోని విధంగా సోషల్‌ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీశాయి.

నితిన్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ అన్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌పై అభిమానాన్ని చాటుకుంటూ తన గత సినిమాల్లో ఆయన రెఫరెన్స్‌ ఇస్తూ వస్తూ ఉన్నారు. ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లోనూ పవన్‌ రిఫరెన్స్‌ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ విషయంపై తాజాగా ఓ జర్నలిస్ట్‌ నితిన్‌ను ఓ ప్రశ్న వేశారు. ఆ జర్నలిస్ట్‌.. ‘‘ మీరు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ అని అందరికీ తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో మీ లుక్‌ పవన్‌ కల్యాణ్‌ గారి లుక్‌లా ఉంది. దాని మీద ‘‘నితిన్‌ పవన్‌ కల్యాణ్‌ను ఎక్కువగా వాడేస్తున్నాడు’ అని అంటున్నార’’ని అన్నాడు.

దీనిపై నితిన్‌ స్పందిస్తూ.. ‘‘ అదేంటసలు.. అదే నాకు అర్థం కావటం లేదు. నేను ఫ్యాన్‌ను.. వాడ్డం ఏంటి? నిజానికి నాకంటే ఎక్కవగా చాలా మంది చాలా ఎక్కువగా వాడారు. ఫస్ట్‌ సినిమాల్లో.. కానీ, వాళ్లు బయటకు చెప్పుకోరు నేను ఫ్యాన్‌ను అని. నేను ఫ్యాన్‌ని.. అది సినిమాలోని ఓ సీన్‌లో డ్రెస్‌. ఏదో కావాలని, ఆయన్ని వాడాలని ఆ డ్రెస్‌ వేసుకుని రాలేదు. అది సినిమాలోని సీన్‌ది. బయట చాలా మంది నాకంటే ఎక్కువగా ఆయన్ని వాడతారు. నేను ఎంత పెద్ద హీరో అయినా.. కాకపోయినా.. నేను ఆయన ఫ్యాన్‌.. ఫ్యాన్‌ అంతే..

నేను ఓ నార్మల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చాను. చాలా నార్మల్‌ కుర్రాడిని. ఓ సారి ఫ్యాన్‌ అంటే.. ఫ్యానే లైఫ్‌ వరకు. ఇప్పుడు చెప్పుకుని .. రేపు ఓ పెద్ద రేంజ్‌ వచ్చాక నేను ఫ్యాన్‌ను కాదు.. నాకు నేనే ఫ్యాన్‌ను అని చెప్పుకునే క్యారెక్టర్‌ నాది కాదు. నేను అంతే.. ఎప్పటికైనా ఆయన ఫ్యాన్‌నే..’’ అని అన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో.. మరోసారి పాత గొడవల్ని తెరపైకి తెచ్చింది. సోషల్‌ మీడియాలో మెగా వర్సెస్‌ అల్లు రచ్చ మళ్లీ మొదలయ్యేలా చేస్తోంది.

గతంలో జరిగిన ఓ గొడవ ఎప్పుడో సమసిపోయింది. రెండు కుటుంబాలు బాగా కలిసిపోయాయి. పవన్‌.. ఆ హీరో కూడా మంచిగా కలిసిపోయారు. ఫ్యామిలీ ఫంక్షన్లనో సైతం కలిసి దర్శనం ఇస్తున్నారు. అంతా సద్దు మణిగి అందరూ హ్యాపీగా కలిసి ఉన్న ఈ సమయంలో వివాదం మళ్లీ తెరపైకి రావటం ఇరు వర్గాల ఫ్యాన్స్‌లో కొంత భయాందోళనను కలుగజేస్తోంది. మరి, నితిన్‌ కామెంట్ల కారణంగా మెగా vs అల్లు రచ్చ మళ్ళీ మొదలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetgrandpashabet girişultrabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet