iDreamPost

స్టార్టప్ న్యూ క్రియేషన్.. స్కూటర్ ని అతికిస్తే ఆటో రిక్షా అయిపోతుంది!

Sruge 32 Specifications: హీరో మోటో కార్ప్ కి చందిన స్టార్టప్ అద్భుత ఆవిష్కరణను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది.

Sruge 32 Specifications: హీరో మోటో కార్ప్ కి చందిన స్టార్టప్ అద్భుత ఆవిష్కరణను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది.

స్టార్టప్ న్యూ క్రియేషన్.. స్కూటర్ ని అతికిస్తే ఆటో రిక్షా అయిపోతుంది!

సాధారణంగా వాహనం అంటే కేవలం డ్రైవ్ చేయడానికి మాత్రమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాహనదారులపై కచ్చితంగా సినిమా ప్రభావం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా జేమ్స్ బాండ్ లాంటి చిత్రాల్లో ఉండే కార్లు, బైకులు అన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అప్పటి వరకు డొక్కు బండిలా ఉండే కారు ఒక్క బటన్ నొక్కగానే సూపర్ కారుగా మారిపోతుంది. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలానే ఉంటాయి. అందుకే సాధారణ వాహనదారులు కూడా వాళ్లు వాడే వాహనాలు ఎంతో కొంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఆ ఆలోచన ఒక స్టార్టప్ కంపెనీకి కూడా వచ్చినట్లుంది. అందుకే స్కూటర్ ని ఆటో రిక్షాగా మార్చే డిజైన్ ని తయారు చేశారు.

హీరో మోటా కార్ప్ కి చెందిన సర్జ్ అనే స్టార్టప్ ఒక వినూత్న ఆవిష్కరణను రూపొందించింది. విద్యుత్ స్కూటర్ ని తగిలించేస్తే ఆటో రిక్షా అయిపోతుంది. ఇటీవల జరిగన హీరో వరల్డ్ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణను ప్రదర్శనకు ఉంచారు. దీని పేరు సర్జ్ 32. ఈ ఆవిష్కరణ స్వయం ఉపాధికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ టూ ఇన్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ ప్రస్తుత రోజుల్లో డబ్బు ఆర్జించుకునేందుకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని అటు టూ వీలర్ గా అలాగే వాణిజ్య అవసరాల కోసం ఆటో రిక్షాగా కూడా వాడుకోవచ్చు. సాధారణంగా ఒక టూ వీలర్, ఉపాధి కోసం మరో త్రీ వీలర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ సర్జ్ 32ని కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. ఈ వాహనం లుక్స్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. టూ వీలర్ అటాచ్ చేస్తే ఆటో అవుతుంది కాబట్టి.. నామమాత్రపు డిజైన్ అనుకుంటే పొరపాటే అవుతుంది.

scooty auto riksha

సాధారణ ఆటో తరహాలోనే దీనికి కూడా హెడ్ ల్యాంప్స్, వైపర్స్, విండ్ స్క్రీన్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ ఉంటాయి. అయితే దీనిని డోర్స్ ఉండవు. కానీ, జిప్పర్స్ సాయంతో సాఫ్ట్ డోర్స్ ని ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ డిజైన్ కు ప్రస్తుతం మార్కెట్ లో మంచి క్రేజ్ మొదలైంది. ఇంక ఈ మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. త్రీవీలర్, టూ వీలర్ కు సెపరేట్ మోటర్స్, బ్యాటరీ సామర్థ్యం ఉంటాయి. త్రీవీలర్ లో 10 కిలో వాట్స్ మోటర్, 11 కిలో వాట్స్ పర్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. అదే టూ వీలర్ అయితే 3 కిలో వాట్స్ మోటర్, 3.5 కిలో వాట్స్ పర్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. టూ వీలర్ గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది.

త్రీ వీలర్ అయితే గంటకు 50 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. అలాగే 500 కిలోల వరకు బరువును లాగగలిగే సామర్థ్యం ఉంటుంది. అయితే టూ వీలర్, త్రీ వీలర్ కి సంబంధించి రేంజ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా ధర వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వాహనం ఇండియాలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పోర్టర్ తరహా సంస్థల్లో వాణిజ్య వాహనంగా దీనిని ఎన్ రోల్ చేసుకోవచ్చు. అలాగే ర్యాపిడో, ఓలా తరహా సంస్థల్లో టూవీలర్ గా కూడా ఎన్ రోల్ చేసుకునే వీలుంటే రెండు విధాలుగా డబ్బు ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుంది. మరి.. ఈ సర్జ్ 32పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి