iDreamPost

క్లాసెన్ కాకా ఊర మాస్ హిట్టింగ్.. ఇది చాలా స్పెషల్..

SRH vs RCB- Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో కొత్త రికార్డును నెలకొల్పింది. మరోసారి ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. వారి పేరిట ఉన్న రికార్డును వాళ్లే బద్దలు కొట్టారు.

SRH vs RCB- Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో కొత్త రికార్డును నెలకొల్పింది. మరోసారి ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. వారి పేరిట ఉన్న రికార్డును వాళ్లే బద్దలు కొట్టారు.

క్లాసెన్ కాకా ఊర మాస్ హిట్టింగ్.. ఇది చాలా స్పెషల్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా వారి ముందు కొండంత లక్ష్యాలను ఉంచుతోంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ పై 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల కెక్కింది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా తమ రికార్డును తామే బద్దులు కొట్టుకుని హైదరాబాద్ జట్టు సంబరాలు చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో మళ్లీ 3 వికెట్ల నష్టానికి ఈసారి ఏకంగా 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒకసారి అంత స్కోర్ చేయడమే కష్టం అనుకుంటే.. రెండోసారి అంతకు మించిన స్కోర్ చేసి హైదరాబాద్ జట్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ లో క్లాసెన్ క్లాస్ హిట్టింగ్ మరో స్పెషల్ అనే చెప్పాలి.

చిన్నస్వామి స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది. గతంలో చేసిన 277/3 రికార్డును బద్దలు కొట్టి ఈసారి 287/3 పరుగుల రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లను గల్లీ క్రికెటర్ల కంటో దారుణంగా చేసి హైదరాబాద్ బ్యాటర్లు విజృంభించారు. బౌలర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా ఆకాశమే హద్దుగా సిక్సులు, ఫోర్లతో చెలరేగారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అద్భుతమైన శతకంతో ఆర్సీబీ జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు. తాను బెటర్ కాదని వదిలేసిన జట్టుకు తన విలువ ఏంటో తెలిసేలా చేశాడు. ఏకంగా 39 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. వాటిలో 9 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.

హెడ్ మాదిరిగా శతకం చేయకపోయినా.. హైదరాబాద్ ఇంత స్కోర్ చేసిందంటే ఆ ఘనత క్లాసెన్ కి కూడా దక్కుతుంది. ఈ మ్యాచ్ లో క్లాసెన్ సిక్సుల మీద సిక్సులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ లో క్లాసెన్ కేవలం 31 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో ఏకంగా 67 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో క్లాసెన్ ఆడుతుంటే విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. బంతులు గ్యాలరీలో పడుతుంటే వాళ్లు పైకి అలా చూస్తూ ఉండిపోయారు. క్లాసెన్ ఈ మ్యాచ్ లో 216 స్టైక్ రేట్ తో విజృంభించాడు. అలాగే ఈ సీజన్ లో భారీ సిక్సర్ ని కూడా నమోదు చేశాడు.

ఈ సీజన్లో వెంకటేశ్ అయ్యర్ 106 మీటర్ల సిక్సర్ బాదిన విషయం తెలిసిందే. ఈరోజు క్లాసెన్ కూడా 106 మీటర్ల సిక్సర్ బాదాడు. ఒక్క దెబ్బకు బంతి స్టేడియం పైన పడింది. ఇంకేముంది అయ్యర్ బిగ్గెస్ట్ సిక్సర్ ని సమానం చేయడం మాత్రమే కాకుండా.. హైదరాబాద్ కు బిగ్గెస్ట్ స్కోర్ వచ్చేలా క్లాసెన్ కాకా కష్టపడ్డాడు. ప్రస్తుతం క్లాసెన్ సిక్సర్ల వర్షం గురించి నెట్టింట తెగ చర్చలు, వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం జరుగుతోంది. ఇంక ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ(34), హెడ్(102), క్లాసెన్(67), మార్కరం(32*), సమద్(37*) విజృంభించారు. మరి.. హైదరాబాద్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి