iDreamPost

వర్షంతో హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్.. ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి!

వర్షంతో హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్.. ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి!

గత వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీని కారణంగా నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక గత మూడు రోజుల నుంచి వర్షం కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా పంజాగుట్టు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక ఈ భారీ వర్షానికి నగరంలో ప్రధాన కూడళ్లలో భారీ ట్రాఫిక్ సమస్య ఎదురైంది.

మరీ ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి దీంతో పాటు ఐకియా నుంచి JNTU వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేస్తున్నాయి. కాగా, వాహనదారులు ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా ఇతర మార్గాల వైపు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక మరోసారి కురిసిన భారీ వర్షానికి వాహన దారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి