iDreamPost

గుండె, కాలేయం, కిడ్నీలను 70 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండే సంజీవని ఈ మొక్క

  • Published May 28, 2024 | 2:11 PMUpdated May 28, 2024 | 2:11 PM

మనిషి నిండు నూరేళ్లు జీవించాలంటే.. కొన్ని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలి. వాటిల్లో ముఖ్యమైనవి గుండె, కాలేయం, కిడ్నీలు. వీటిని కాపాడటంలో ఓ మొక్క సంజీవని మాదిరి పని చేస్తుంది. ఇంతకు అది ఏది అంటే..

మనిషి నిండు నూరేళ్లు జీవించాలంటే.. కొన్ని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలి. వాటిల్లో ముఖ్యమైనవి గుండె, కాలేయం, కిడ్నీలు. వీటిని కాపాడటంలో ఓ మొక్క సంజీవని మాదిరి పని చేస్తుంది. ఇంతకు అది ఏది అంటే..

  • Published May 28, 2024 | 2:11 PMUpdated May 28, 2024 | 2:11 PM
గుండె, కాలేయం, కిడ్నీలను 70 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండే సంజీవని ఈ మొక్క

నేటి కాలంలో ఆస్పత్రి ఖర్చులు సామాన్యులను భయంతో ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చిన్న పాటి అనారోగ్యానికి గురై.. ఆప్పత్రికి వెళ్తే చాలు.. వేలకు వేల రూపాయల బిల్లు చెల్లించాల్సి పరిస్థితి. సామాన్యులు తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైతే.. బయట పడాలంటే.. ఆస్తులు అమ్ముకోని.. అవి సరిపోక.. అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కొన్నింటికి అసలు చికిత్స కూడా ఉండటం లేదు. ఈ క్రమంలో జనాలు ఆయుర్వేద, పురాతన వైద్యం చిట్కాలకు ఓటేస్తున్నారు. ఈ క్రమంలో మన శరీరంలోని ప్రధానమైన గుండె, కాలేయం, కిడ్నీలను 70 ఏళ్ల పాటు ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉంచే ఓ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైన చెప్పిన అవయవాల ఆరోగ్యానికి ఈ మొక్క సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. ఇంతకు ఆ మొక్క ఏంటి.. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే..

ఇంతకు ఆ మొక్క ఏది అంటే.. బొప్పాయి.. పొప్పడి. బొప్పాయి రుచికరమైన పండు మాత్రమే కాక.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బొప్పాయి పండు తింటే జీర్ణ క్రియ మెరుగు పడటమే కాక.. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండి.. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. బొప్పాయి పండు మాత్రమే కాక.. బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్య ప్రదాయణిగా పని చేస్తాయి అంటున్నారు వైద్యులు. బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ ట్యూమర్‌ గుణాలు క్యాన్సర్‌ నివారణలో సహయపడుతుంది. ఇది కణితులను నివారించి.. క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాక బొప్పాయి ఆకుల రసంలో ఉండే పాపైన్‌ అనే ఎంజైమ్‌.. కడుపు సమస్యలను నయం చేస్తుంది.

బొప్పాయి ఆకుల రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు. ఇది వివిధ వ్యాధులను నయం చేయడంలో సాయం చేస్తుంది. అంతేకాక బొప్పాయి ఆకుల రసం గుండె, కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి మంచి ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్సలో బొప్పాయి రసం కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని తాగితే ప్లేట్‌లెట్‌ కౌంట్‌, ఎర్ర రక్త కణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. రక్త ప్రసరణను వేగవంతంగా మెరుగు పరుస్తుంది. బొప్పాయి ఆకుల రసం గర్భాశయ, రొమ్ము, ప్రొస్టేట్‌, ఊపరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో సహాయపడుతుంది. అలానే బొప్పాయి ఆకుల రసం మలబద్దకానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీన్ని బేది మందు అని కూడా అంటారు.

బొప్పాయి ఆకుల రసం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌​ లక్షణాలు ఆక్సీకరణ, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు కాలేయం, మూత్ర పిండాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సాయం చేస్తుంది. బొప్పాయి రసం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడ సాయం చేస్తుంది. అందుకే గుండె, కిడ్నీలు, కాలేయం ఆరోగ్యానికి బొప్పాయి ఆకు రసం సంజీవని వంటిది అంటారు వైద్యులు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి