iDreamPost

వాడు అసభ్యంగా ప్రవర్తించాడు.. చెంప పగలకొట్టాను: కీర్తి సురేష్‌

  • Published Feb 10, 2024 | 12:01 PMUpdated Feb 10, 2024 | 12:56 PM

Keerthy Suresh: మహానటి కీర్తి సురేశ్ సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తారో అందరికి తెలిసిందే. కానీ, బయట మాత్రం చాలా మాస్ హీరోయిజాన్ని చూపిస్తారట. ఈ క్రమంలోనే ఏకంగా ఒకడి చెంప పగలగొట్టారట. అసలేం జరిగిదంటే..

Keerthy Suresh: మహానటి కీర్తి సురేశ్ సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తారో అందరికి తెలిసిందే. కానీ, బయట మాత్రం చాలా మాస్ హీరోయిజాన్ని చూపిస్తారట. ఈ క్రమంలోనే ఏకంగా ఒకడి చెంప పగలగొట్టారట. అసలేం జరిగిదంటే..

  • Published Feb 10, 2024 | 12:01 PMUpdated Feb 10, 2024 | 12:56 PM
వాడు అసభ్యంగా ప్రవర్తించాడు.. చెంప పగలకొట్టాను: కీర్తి సురేష్‌

‘కీర్తి సురేష్’. ఈమె పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తుకు వస్తుంది. అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అందాల బామ. అచ్చం అలనాటి నటి సావిత్రిని తలపించేలా.. ఇంకొన్ని తరాలకు ఈమె ఒక మహానటిలా గుర్తుండిపోయేలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అలాగే మహానటి చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది ఈ బ్యూటీ. అయితే కీర్తి మొదటగా మలయాళంలోని ‘గీతాంజలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘నేను శైలజ సినిమాతో’ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే, కీర్తి కెరీర్ లో మహానటి ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఆన్ స్క్రీన్ మీద తన నటనతో అదరగొట్టిన కీర్తి సురేష్ ఆఫ్ స్క్రీన్ లో కూడా తన మాస్ హీరోయిజాన్ని చూపించిందట. సినిమాల్లో సాఫ్ట్ గా కనిపించే కీర్తి సురేష్.. బయట మాత్రం రఫ్ఫాడిస్తుందట. ఇండస్ట్రీలోకి రాక ముందు తన నిజ జీవితంలో ఓ వ్యక్తి చెంప పగులగొట్టిందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తాను నటిగా పరిచయం కాకముందు ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి వెల్లడించింది. ఒక రోజు తాను తన స్నేహితురాళ్ళతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పింది.

ఆ సమయంలో తనకు పట్టరానంత కోపం రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు తెలిపింది. కానీ, ఆ తర్వాత ఆ మందు బాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేష్ గుర్తు చేసుకుంది. ఇక పోలీసులు ఆ వ్యక్తిని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని గత సంఘటనలను గుర్తు చేసుకుంది. ఇక కీర్తి సురేష్ తాజాగా జయం రవి ‘సైరన్’ సినిమాలో నటించింది. ఇందులో పోలీస్ అధికారిగా నటించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగిందట. కాగా, ఈ మూవీ ఈ నెల 16న థియేటర్లలోకి రానుంది. మరి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగులగొట్టానని కీర్తి సురేష్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి