iDreamPost

హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్, సుప్రీంలో స‌వాల్

హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్, సుప్రీంలో స‌వాల్

గణేష్ చతుర్థి వేడుకలకు కర్ణాటక హైకోర్టు అనుమతించిన మరుసటి రోజే, హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో, బుధవారం ఉదయం హిందూ నాయకులు కొంద‌రు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కర్నాటకలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాల చుట్టూ ముసురుతున్న వివాదంతో, కర్ణాటక హైకోర్టు ఆదేశాలను స‌వాల్ చేస్తూ, అంజుమన్ ఇస్లాం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మంగళవారం జరిగిన రెండు వేర్వేరు కోర్ట్‌రూమ్ పోరాటాలలో క‌ర్ణాట‌క అంత‌టా ఆస‌క్తి రేగింది. బెంగుళూరులోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించకూడదని అంటూ సుప్రీం కోర్టు య‌థాస్థితి కొన‌సాగాల‌ని తీర్పునిచ్చింది. ఇక్క‌డో మ‌రో ట్విస్ట్. వేడుకలను నిర్వ‌హించాల‌న్న‌ హుబ్బలి మేయర్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ అర్థరాత్రి నిరాకరించింది. దీంతో తెల్ల‌వారే వినాయ‌క మండ‌పాన్ని ఎర్పాటుచేసిన హిందూ నాయ‌కులు పూజ‌లు మొద‌లుపెట్టారు.

గణేష్ చతుర్థి వేడుకలను హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో స్థానిక ప్రజాప్రతినిధులు వినాయ‌క చ‌వితిని నిర్వ‌హిస్తున్నారు.

కర్ణాటకలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు అనుకున్న‌ట్లుగానే జరుగుతాయని, బెంగళూరు ఈద్గా మైదాన్ లో ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌న్న‌ సుప్రీంకోర్టు ఆదేశాల‌తో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

అర్ధరాత్రి విచారణలో, బెంగళూరు ఈద్గా భూమి విషయంలో యాజమాన్యంపై ఉన్న‌ తీవ్రమైన వివాదం హుబ్బళ్లి కేసులో లేదన్న‌ది హైకోర్టు మాట‌. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశం వర్తించదని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి అన్నారు. హుబ్బళ్లి మైదానం కార్పొరేషన్ ఆస్తి. కార్పొరేష‌న్ అనుకుంది చేయ‌గ‌ల‌దు. రంజాన్ , బక్రీద్ ల్లో ప్రార్ధ‌న‌లు చేయ‌డానికి రెండు రోజులున్నాయి. అందుకే, వాస్తవానికి జోక్యం చేసుకోలేమ‌ని న్యాయమూర్తి చెప్పారు.

400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులోని ఈద్గా స్ధలంలో, వినాయ‌క చ‌వితి వేడుకల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, అంజుమన్-ఎ-ఇస్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెంగళూరులోని ఈద్గా మైదానంలో, గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దానికి విచార‌ణ చేప‌ట్ట‌ని సుప్రీం య‌థాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని తీర్పునిచ్చింది. త‌దుప‌రి విచార‌ణ‌ను త్రిస‌భ్య బెంచ్ కి పంపించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి