iDreamPost

వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయకుడి మండపం వద్ద ముస్లిం సోదరుల అన్నదానం

వెల్లివిరిసిన మత సామరస్యం.. వినాయకుడి మండపం వద్ద ముస్లిం సోదరుల అన్నదానం

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు లంభోదరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఘనంగ వేడుకలను నిర్వహిస్తున్నారు. వాడ వాడలో కొలువైన గణేష్ మండపాల వద్ద భజనలతో అన్నదాన కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఈ క్రమంలో వినాయకుడి మండపం వద్ద మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు గణేషుడి వద్ద అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనమంతా భారతీయులం, హిందూ ముస్లి భాయీ భాయీ అనే విషయాన్ని నిరూపించారు ముస్లిం సోదరులు. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

గణేష్ పండుగ మొదలయ్యిందంటే నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంటారు గణేష్ భక్తులు. అయితే ఇక్కడ హిందువులే కాకుండా ముస్లిం సోదరులు కూడా అన్నదానం చేయడం మతసామరస్యానికి ప్రతీకగా మారింది. సిద్దిపేటలో గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయకుడి మండపం వద్ద ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. అక్కడికి వచ్చిన వినాయకుడి భక్తులందరికి అన్నదానం చేశారు. హిందూ మస్లింల ఐక్యతకు అద్దంపట్టే ఈ ఘటన అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని నిలబెట్టి ప్రశంసలు అందుకుంటున్నారు ముస్లిం సోదరులు. మనమంతా మనుషులం.. మానవత్వమే మన మతం అని నిరూపించిన ముస్లిం సోదరులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి