iDreamPost

హసరంగా సంచలన బ్యాటింగ్‌! కొద్దిలో మిస్‌ అయిన యువీ రికార్డు

  • Published Aug 09, 2023 | 10:40 AMUpdated Aug 09, 2023 | 10:40 AM
  • Published Aug 09, 2023 | 10:40 AMUpdated Aug 09, 2023 | 10:40 AM
హసరంగా సంచలన బ్యాటింగ్‌! కొద్దిలో మిస్‌ అయిన యువీ రికార్డు

శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా బాల్‌తో మ్యాజిక్‌ చేయడం చాలా సార్లు చూశాం. కానీ, ఈ సారి బ్యాట్‌తో మెస్మరైజ్‌ చేశాడు. హసరంగా బిగ్‌ షాట్‌ ఆడగలడని, ఓ మోస్తారు ఆల్‌రౌండర్‌ అనే విషయం తెలిసిందే. కానీ, ఈ రేంజ్‌లో బౌలర్ల ఊచకోతకు దిగుతాడని చాలా మంది ఊహించి ఉండరు. శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌లో మంగళవారం బీ-లవ్‌ క్యాండీ, గాలే టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హసరంగా తన విశ్వరూపం చూపించాడు. తొలుత బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన రంగా.. తర్వాత బౌలింగ్‌లో తన మ్యాజిక్‌ను రిపీట్‌ చేశాడు.

ముఖ్యంగా బ్యాటింగ్‌ గురించి మాట్లాడుకుంటే.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. హసరంగా ఆడుతున్న వేగానికి టీమిండియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2007లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రికార్డును బ్రేక్‌ చేసేలా కనిపించాడు. కానీ, ఆ రికార్డ్‌ను అందుకోలేకపోయాడు. మొత్తం మీద 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ కూడా తన పేరు మీదే ఉండటం గమనార్షం. అయితే.. మొత్తం ఎల్‌పీఎల్‌లో ఈ ఇన్నింగ్స్‌తో మూడో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. బీ లవ్‌ క్యాండీ టీమ్‌కు హసరంగానే కెప్టెన్‌. రంగాతో పాటు మ్యాథ్యూస్‌ 40 పరుగులతో, ఓపెనర్‌ ఫకర్‌ జమన్‌45 పరుగులతో రాణించడంతో బీ లవ్‌ టీమ్‌ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

ఈ భారీ టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే టైటాన్స్‌ను మళ్లీ హసరంగానే దారుణంగా దెబ్బతీశాడు. ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగి.. గాలే ఓటమిని శాసించాడు. హసరంగాతో పాటు ప్రదీప్‌ 3, ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ 2 వికెట్లతో చెలరేగడంతో గాలేకు భారీ ఓటమి తప్పలేదు. బీలవ్‌ బౌలర్లు చెలరేగడంతో 16.4 ఓవర్లలోనే కేవలం 114 పరుగులకే గాలే జట్టు ఆలౌట్‌ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 64 పరుగులు, బౌలింగ్‌లో 4 వికెట్లతో రాణించిన హసరంగాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ అద్భుత విజయంతో హసరంగా సారథ్యంలోని బీలవ్‌ క్యాండీ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో హసరంగా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఛీ.. నువ్వింత అసూయపరుడివా? పాండ్యాపై ఫ్యాన్స్‌ మండిపాటు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి