iDreamPost

యూట్యూబ్ సెన్సేషన్ హర్షసాయి మూవీ అప్డేట్! టైటిల్, టీజర్..

  • Author Soma Sekhar Published - 08:48 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Published - 08:48 PM, Wed - 13 September 23
యూట్యూబ్ సెన్సేషన్ హర్షసాయి మూవీ అప్డేట్! టైటిల్, టీజర్..

హర్షసాయి.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న యూట్యూబర్ గా తన కెరీర్ ను ప్రారంభించి.. దేశంలోనే టాప్ యూట్యూబర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ సాయం చేస్తూ ఉంటాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన హర్షసాయికి చిన్నపాటి స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంతకాలంగా హర్ష గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? హర్షసాయి త్వరలోనే హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నడన్న వార్త. ఇక ఈ మూవీని బిగ్ బాస్ ఫేం మిత్రా శర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతోంది.

హర్షసాయి.. త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే అతడు హీరోగా వస్తాడా? లేక డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా? అన్న విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. అయితే హీరోతో పాటుగా దర్శకత్వ బాధ్యతలు కూడా హర్షసాయి చేపట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఈనెల 17న హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ లోనే టైటిల్ ను లాంచ్ చేయనున్నారు. సెప్టెంబర్ 17 ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్ హాల్ లో ఈ వేడుక జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రీ పిక్చర్స్ పతాకంపై ప్రొడ్యూసర్ మిత్రశర్మ నిర్మించనున్నారు.

ఇక ఈ మూవీ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాగా.. ప్రొడ్యూస్ మిత్రశర్మ బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. దీంతో హర్షసాయి అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూడాలని ఆరాటపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు? అన్న విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే అన్ని విషయాలు తెలియబోతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mitraaw (@mitraaw_sharma)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి