iDreamPost
android-app
ios-app

లాస్య నందిత అంత్యక్రియల్లో పాడె మోసిన హరీష్ రావు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా, బీఆర్ఎస్ నేతలు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా, బీఆర్ఎస్ నేతలు..

లాస్య నందిత అంత్యక్రియల్లో పాడె మోసిన హరీష్ రావు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునే సరికి తీవ్రగాయాలైన లాస్య నందిత.. అప్పటికే మరణించారు. కారు ఎదురు భాగం నుజ్జు నుజ్జయ్యింది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీటు బెల్ట్ లేకపోవడం వల్లే ఆమె మరణించిటన్లు పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు.

రాత్రి తమతో గడిపిన లాస్య నందిత.. తెల్లారే సరికి విగత జీవిగా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు అప్పగించగా..కార్ఖానాలోని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలు, ఆమె అనుచరులు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో భాగంగా ఆమె పాడెను మోసారు.

వీరి వెంట బీఆర్ఎస్ నేతలు వేముల పల్లా ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ దివంగతన సాయన్న కుమార్తెనే లాస్య నందిత. గత ఏడాది ఫిబ్రవరిలో సాయన్న మృతి చెందారు. నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పేరు ఖరారు చేసి బీఆర్ఎస్ అధిష్టానం. వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆమె. కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలపై పోటీ చేసి.. భారీ మెజార్టీతో గెలుపొందారు లాస్య. ఎమ్మెల్యేగా పదవి చేపట్టి.. మూడు నెలలు కూడా పూర్తికాకుండానే.. ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, కారు ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందిన పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఆరు దంతాలతో పాటు కాలు పూర్తిగా విరిగిపోయినట్లు తెలిసింది.