iDreamPost

పవన్ నిన్ను ప్రశ్నిస్తే తప్పు ఏంటి? హరిరామజోగయ్య మరో లేఖ

Chegondi Harirama Jogaiah: జనసేన అధ్యక్షుడి పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడలని కోరుకునే వారిలో హరిరామ జోగయ్య ఒకరు. అందుకే పవన్ కల్యాణ్ కి అనేక సలహాలు, సూచనలను లేఖల రూపంలో అందిస్తుంటారు. తాజాగా మరోసంచలన లేఖ రాశారు.

Chegondi Harirama Jogaiah: జనసేన అధ్యక్షుడి పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడలని కోరుకునే వారిలో హరిరామ జోగయ్య ఒకరు. అందుకే పవన్ కల్యాణ్ కి అనేక సలహాలు, సూచనలను లేఖల రూపంలో అందిస్తుంటారు. తాజాగా మరోసంచలన లేఖ రాశారు.

పవన్ నిన్ను ప్రశ్నిస్తే తప్పు ఏంటి? హరిరామజోగయ్య మరో లేఖ

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత ఏపీ పాలిటిక్స్ లో మరింత సెగలు రేపుతున్నాయి. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన నేతలు కాపు నాయకులు తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య శాస్త్రి తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కి వరుస బెట్టి లేఖలు రాస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి తొలిజాబితా ప్రకటించిన తరువాత కూడ పలు ప్రశ్నలు సంధిస్తూ పవన్ కి లేఖ రాశారు. తాజాగా మరో సంచలన లేఖను హరిరామ జోగయ్య శాస్ర్రీ రాశారు. జనసేన లేకుండా టీడీపీ గెలవలేదంటూ ఆ లేఖలో ప్రస్తావించారు.

జనసేన అధ్యక్షుడి పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడలని కోరుకునే వారిలో హరిరామ జోగయ్య ఒకరు. అందుకే పవన్ కల్యాణ్ కి రాజకీయంగా నిలదొక్కునేందుక అనేక సలహాలు, సూచనలను లేఖల రూపంలో అందిస్తుంటారు. తన లేఖలపై పవన్ స్పందిచకున్నా కూడా హరిరామ జోగయ్య మాత్రం వదలడం లేదు. సీట్ల విషయంలో , పవర్ షేరింగ్ విషయంలో స్పష్టత తీసుకోవాలని పలుమార్లు పవన్ కల్యాణ్ కి సూచించారు. అయితే అవేమి పట్టించుకోని పవన్ కల్యాణ్ కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో జనసేన నేతలతో పాటు కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవలే ఓ లేఖ రాసిన హరిరామ జోగయ్య తాజాగా మరో సంచలన లేఖ రాశారు. ఇక లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తన సలహాలు పవన్‌ కల్యాణ్ కి నచ్చినట్లు లేదన్నారు. అలానే పవన్ కల్యాణ్, జనసేన లేకుండా టీడీపీ  వచ్చే ఎన్నిక అసాధ్యమన్నారు. ఆ విషయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీని నిర్వీర్యం చేసి.. లోకేష్‌ను సీఎం చేస్తారన్న భయం తనతో సహా జనసేన కార్యకర్తల్లో ఉందని హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఎంటో చెప్పాలని, కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి ఆయన ప్రశ్నించారు.

తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని హరిరామ జోగయ్య మండిపడ్డారు. తన మంచి కోరేవారు ఎవరో ,మిత్రులెవరో.. శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని సూచించారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్‌పై ఆరోపణలు చేస్తుంటే.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ కు తానంటే  ఇష్టమున్నా లేక పోయినా అయన వెంటే ఉంటానని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు.

పవన్ రాజకీయంగా ముందుకెళ్లేందుకు తన మద్దతు ఎప్పటికి ఉంటుందన్నారు. హరిరామజోగయ్య గతకొంత కాలంగా పవన్ కి బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు చేసిన జెండా సభలో పవన్ కల్యాణ్ కొంతమంది పెద్దలు తనకు సలహాలు ఇవ్వడం మానుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ గా హరిరామజోగయ్య ఈ లేఖ రాసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. హరిరామ జోగయ్య రాసిన తాజాగా లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి