iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో పాండ్యాకు చోటు కష్టమే! ఎందుకంటే..?

  • Published Apr 14, 2024 | 4:41 PM Updated Updated Apr 14, 2024 | 4:41 PM

Hardik Pandya, T20 World Cup 2024: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాకు రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాలో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, T20 World Cup 2024: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాకు రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాలో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 14, 2024 | 4:41 PMUpdated Apr 14, 2024 | 4:41 PM
టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో పాండ్యాకు చోటు కష్టమే! ఎందుకంటే..?

ఒక వైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతోంది. క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ ఫీవర్‌తోనే ఊగిపోతున్నారు. ఏ ఇద్దరు క్రికెట్‌ లవర్స్‌ కలిసినా.. ఐపీఎల్‌ గురించే చర్చ. కానీ, కొంతమంది క్రికెట్‌ నిపుణులు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్‌ను నిశితంగా పరిశీలిస్తూ.. జూన్‌లో వెస్టిండీస్‌ వేదికగా ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారత్‌ ఎలాంటి టీమ్‌తో వెళ్తే బాగుంటుందో అని అంచనా వేస్తున్నారు. టీ20 టీమ్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్ల ప్లేస్‌ కన్ఫామ్‌ అయినా.. మిగతా స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ఈ క్రమంలోనే టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ప్లేస్‌ కస్టమే అంటూ ప్రముఖ కామెంటేటర్‌ హర్ష భోగ్లే అభిప్రాయపడ్డాడు. టీమిండియాలో స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయలేకపోతే టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఎంపిక అవుతాడా? అతడు బౌలింగ్ చేయకుండా టీమిండియా టాప్ 6లో స్థానం సంపాదించుకోగలడా? ఒక వేళ బౌలింగ్‌ చేయకుండా, కేవలం బ్యాటర్‌గానే పాండ్యాను టీమ్‌లోకి తీసుకుంటే.. అది సరికాదని, దాన్ని నేను అంగీకరించలేనని భోగ్లే వెల్లడించాడు.

ఎందుకంటే.. పాండ్యా పవర్‌ఫుల్‌గా బ్యాటింగ్ చేయడం లేదు. పైగా బౌలింగ్‌ కూడా చేయకపోతే, అతను బ్యాటింగ్‌లో కచ్చితంగా మెరుగ్గా రాణించాలి, ఆ రెండు చేయకుంటే.. అతను టీమిండియాలో ఉండటం దండగా అని హర్షా భోగ్లే తెలిపాడు. కాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మధ్యలో గాయపడిన హార్దిక్ కోలుకుని ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌కు రాలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. మొత్తంగా ఒక ఆల్‌రౌండర్‌గా విఫలం అవుతున్న పాండ్యాకు టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ప్లేస్‌ దక్కదనే వాదన బలంగా వినిపిస్తోంది. దానికి భోగ్లే వ్యాఖ్యలు కూడా జతకలిశాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.