iDreamPost
android-app
ios-app

వీడియో: హార్ధిక్‌ పాండ్యా కొట్టిన ఈ సిక్స్‌ చూశారా? ఎక్కడికో వెళ్లి పడింది!

  • Published Jun 21, 2024 | 1:52 PM Updated Updated Jun 21, 2024 | 1:52 PM

Hardik Pandya, IND vs AFG, T20 World Cup 2024: ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా తన పవరేంటో చూపిస్తూ.. తన బిరుదును సార్థకం చేసుకున్నాడు. ఇంతకీ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Hardik Pandya, IND vs AFG, T20 World Cup 2024: ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా తన పవరేంటో చూపిస్తూ.. తన బిరుదును సార్థకం చేసుకున్నాడు. ఇంతకీ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 21, 2024 | 1:52 PMUpdated Jun 21, 2024 | 1:52 PM
వీడియో: హార్ధిక్‌ పాండ్యా కొట్టిన ఈ సిక్స్‌ చూశారా? ఎక్కడికో వెళ్లి పడింది!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా జరిగిన సూపర్‌ 8 తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. గురువారం బార్బడోస్‌ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ దుమ్మురేపడంతో టీమిండియాకు సునాయాసమైన విజయం దక్కింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా కొట్టిన ఒక సిక్స్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఆ సిక్స్‌ చూస్తే.. పాండ్యాను అంతా కుంఫూ పాండ్యా అని ఎందుకు పిలుస్తారో అర్థం అవుతుంది.

టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఈ భారీ సిక్స్‌ చోటు చేసుకుంది. ఆఫ్ఘాన్‌ స్టార్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన ఆ ఓవర్‌లోని నాలుగో బంతికి పాండ్యా మిడ్‌ వికెట్‌ పైనుంచి అద్భుతమైన షాట్‌ ఆడాడు. అది ఏకంగా స్టేడియం రూఫ్‌పై పడి.. బయటికి వెళ్లి పడింది. ఆ సిక్స్‌ కొట్టిన విధానం చూసి.. కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. అంతకంటే ముందు విరాట్‌ కోహ్లీ సైతం నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లోనే స్ట్రైట్‌ సిక్స్‌ కొట్టాడు. అది కూడా సూపర్‌ సిక్స్‌ అనే చెప్పాలి. అయితే.. పాండ్యా కొట్టిన సిక్స్‌.. స్టేడియం బయటికి వెళ్లిపోవడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది సూర్యకుమార్‌ యాదవ్‌ 28 బంతుల్లో 53, హార్ధిక్‌ పాండ్యా 24 బంతుల్లో 32, విరాట్‌ కోహ్లీ 24 పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఫారూఖీ 3, రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టారు. నవీన్‌ ఉల్‌ హక్‌కి ఒక వికెట్‌ దక్కింది. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్‌ను టీమిండియా బౌలర్లు 134 పరుగులకే కుప్పకూల్చారు. జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ మూడేసి వికెట్లతో చెలరేగడంతో విజయం సులువైంది. అక్షర్‌ పటేల్‌ 1, కుల్దీప్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కొట్టిన భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.