iDreamPost
android-app
ios-app

పంజాబ్‌పై మ్యాచ్‌ గెలిచానా హార్ధిక్‌ పాండ్యాకు తప్పని తలనొప్పి!

  • Published Apr 19, 2024 | 9:30 AM Updated Updated Apr 19, 2024 | 9:30 AM

Hardik Pandya, MI vs PBKS: బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా విఫలం అవుతున్నా.. పాండ్యా టీమ్‌ మాత్రం విజయం సాధించింది. అయినా కూడా పాండ్యా చేసిన ఒక తప్పుతో అతనికి జరిమానా పడింది. మరి పాండ్యాకు ఎందుకు జరిమానా విధించారో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, MI vs PBKS: బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా విఫలం అవుతున్నా.. పాండ్యా టీమ్‌ మాత్రం విజయం సాధించింది. అయినా కూడా పాండ్యా చేసిన ఒక తప్పుతో అతనికి జరిమానా పడింది. మరి పాండ్యాకు ఎందుకు జరిమానా విధించారో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 19, 2024 | 9:30 AMUpdated Apr 19, 2024 | 9:30 AM
పంజాబ్‌పై మ్యాచ్‌ గెలిచానా హార్ధిక్‌ పాండ్యాకు తప్పని తలనొప్పి!

క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని పంచుతూ.. జోరుగా హుషారుగా సాగుతున్న ఐపీఎల్‌ 2024లో నిబంధనలు కూడా కఠినంగా ఫాలో అవుతున్నారు నిర్వహకులు. గురువారం ముల్లాన్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యాకు జరిమానా విధించారు. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత.. రెండు విజయాలు చవిచూసిన ముంబై ఇండియన్స్‌.. మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఆరు మ్యాచ్‌ల్లో 4 ఓటములు, 2 విజయాలతో.. గురువారం పంజాబ్‌తో మ్యాచ్‌ ఆడిన ముంబై.. మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జట్టు విజయం అయితే దక్కింది కానీ, కెప్టెన్‌ పాండ్యాకు మాత్రం.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా.. మ్యాచ్‌ రెఫరీలు రూ.12 లక్షల ఫైన్‌ వేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 8 బంతుల్లో 8 పరుగులు చేసి తర్వాతగానే అవుటైనా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేసి రాణించాడు. ఇషాన్‌ అవుటైన తర్వాత రోహిత్‌కు జతకలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్‌ అవుట్‌ అయ్యాక.. తిలక్‌ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా 6 బంతుల్లో 10, టిమ్‌ డేవిడ్‌ 7 బంతుల్లో 14, షెఫర్డ్‌ 1 విఫలం అయ్యారు. మొత్తంగా పంజాబ్‌ ముందు ముంబై 193 పరుగుల టఫ్‌ టార్గెట్‌ ఉంచింది.

పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, సామ్‌ కరన్‌2, రబాడ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోయింది. 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ సామ్‌ కరన్‌ 6, ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ 0, రోసోవ్‌ 1, లివింగ్‌స్టోన్‌ 1 దారుణంగా విఫలం అయ్యారు. కానీ, శశాంక్‌ 41, అశుతోష్‌ 61 పరుగులతో అదరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి.. పంజాబ్‌లో ఆశలు చిగురించేలా చేశారు. కానీ, చివర్లో వాళ్లు అవుట్‌ కావడంతో పంజాబ్‌ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్లలో కోయోట్జీ, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యాకు జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.