iDreamPost
android-app
ios-app

VIDEO: టీమిండియా ఓటమి! కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

  • Published Aug 04, 2023 | 3:56 PM Updated Updated Aug 04, 2023 | 3:56 PM
  • Published Aug 04, 2023 | 3:56 PMUpdated Aug 04, 2023 | 3:56 PM
VIDEO: టీమిండియా ఓటమి! కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

హార్దిక్‌ పాండ్యా చాలా కాలంగా టీమిండియాలో స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. అలాగే టీ20ల్లో జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ పాండ్యాను భారత జట్టును నడిపిస్తున్నాడు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగుల స్కోర్‌ చేసింది. ఈ టార్గెట్‌ను యువ టీమిండియా ఈజీగా ఛేజ్‌ చేసి గెలుస్తుందని భావించినా అలా జరగలేదు.

150 పరుగుల నామమాత్రపు టార్గెట్‌ను ఛేదించలేక కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ 21, తిలక్‌ వర్మ 39 పరుగులతో రాణించారు. కానీ, మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ దారుణంగా విఫలం అయ్యారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ సైతం పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో టీమిండియా తొలి టీ20లో ఓటమి పాలై.. మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది.

అయితే.. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాలను ఆలపించాయి. ఈ క్రమంలో ఇండియా నేషనల్‌ ఆంథమ్‌ వస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చాలా ఎమోషనల్‌ అయ్యాడు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకోలేక.. చివరి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాండ్యా కంటతడి పెట్టుకున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. తన కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులను తల్చుకుని పాండ్యా జాతీయ గీతం పాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. మరి పాండ్యా ఎమోషనల్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్యాటింగ్‌కు వెళ్లిన చాహల్‌ను వెనక్కి పిలిపించిన హార్దిక్‌ పాండ్యా! కానీ..