SNP
Hardik Pandya, Rohit Sharma, IPL 2024: ముంబై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌తో హార్ధిక్ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాండ్యా చేసిన దాంట్లో తప్పు ఏం లేదనే వాదన వినిపిస్తోంది. మరి అదేంటో పూర్తిగా తెలుసుకుందాం..
Hardik Pandya, Rohit Sharma, IPL 2024: ముంబై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌తో హార్ధిక్ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాండ్యా చేసిన దాంట్లో తప్పు ఏం లేదనే వాదన వినిపిస్తోంది. మరి అదేంటో పూర్తిగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా అతి చేశాడంటూ అతనిపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించాడంటూ పాండ్యాను క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మను 30 యార్డ్ సర్కిల్ నుంచి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు పంపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ విషయంలో అంతా పాండ్యాను తప్పుబడుతున్నారు. కానీ, ఈ విషయంలో పాండ్యా తప్పు ఏముందంటూ.. కొంతమంది పాండ్యా ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాండ్యాపై జరుగుతున్న ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా పాండ్యా ఫ్యాన్స్ వారి వాదనను వినిపిస్తున్నారు. ఆ వాదనే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటే, రోహిత్ శర్మ ఒక ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. గతంలో అతను ముంబైకి కెప్టెన్‌గా చేసి ఉన్నాడు, ఒక సీనియర్ ప్లేయర్ ఆ విషయాలను పక్కనపెడితే.. ముంబై టీమ్‌లో మాత్రం అతను ఒక ప్లేయర్, పాండ్యా అతని కెప్టెన్. ఒక కెప్టెన్‌గా మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు తన టీమ్‌లోని సభ్యులను ఫీల్డింగ్ పెట్టుకోవచ్చు. పాండ్యా కూడా అదే చేశాడు. ఆ టైమ్‌లో టీమ్ అవసరాల దృష్ట్యా.. రోహిత్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ పెట్టాడు అందులో తప్పేముంది? విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ టీమిండియా కెప్టెన్ అయ్యాకా.. కోహ్లీని రోహిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు పెట్టలేదా? అప్పుడు కెప్టెన్‌గా రోహిత్ చేసింది రైట్ అయితే.. ఇప్పుడు కెప్టెన్‌గా పాండ్యా చేసింది కూడా సరైందే అంటూ పాండ్యా ఫ్యాన్స్ అంటున్నారు.
పైగా రోహిత్ శర్మను మొదటి నుంచి పూర్తిగా బౌండరీ లైన్ వద్దే ఫీల్డింగ్ పెట్టలేదు. చివరి ఓవర్‌లో చాలా అవసరమైనప్పుడు మాత్రమే రోహిత్‌ను లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్‌కు పెట్టాడు పాండ్యా. అయినా.. మ్యాచ్ స్టార్ అయిన దగ్గర్నుంచి.. రోహిత్‌తో పాండ్యా మాట్లాడుతూను ఉన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినా.. ఒక సీనియర్ ప్లేయర్‌గా తనకు, బౌలర్లకు సలహాలు ఇస్తుంటే వాటిని.. పాటించారు కూడా అంటే పాండ్యా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక సీనియర్ ప్లేయర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతని ఫ్యాన్స్‌కు ఆ విషయం బాధపెడుతుందని, అలా అని కొత్తగా కెప్టెన్‌గా వచ్చిన వ్యక్తిపై మరీ ఇంత ట్రోలింగ్ సరికాదని అంటున్నారు. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్‌ను తప్పించి, పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది కానీ, పాండ్యా రోహిత్ నుంచి లాక్కోలేదు కాదా అని పాండ్యా ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ వర్సెస్ పాండ్యా ఫైట్‌లో పాండ్యా ఫ్యాన్స్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.