iDreamPost

థియేటర్‌లో దుమ్ము రేపిన హనుమాన్‌ ఓటీటీ రైట్స్‌ అంత తక్కువకా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

  • Published Feb 28, 2024 | 9:53 AMUpdated Feb 28, 2024 | 10:08 AM

దేశవ్యాప్తంగా ఆద్భుతం సృష్టించి, రికార్డులు కొల్లగొట్టిన హనుమాన్ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా ఆద్భుతం సృష్టించి, రికార్డులు కొల్లగొట్టిన హనుమాన్ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Feb 28, 2024 | 9:53 AMUpdated Feb 28, 2024 | 10:08 AM
థియేటర్‌లో దుమ్ము రేపిన హనుమాన్‌ ఓటీటీ రైట్స్‌ అంత తక్కువకా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

సంక్రాతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ మూవీ దేశవ్యాప్తంగా రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించి భారీ హిట్ టాక్ ను న సొంత చేసుకున్న ఘనత దర్శకుడు ప్రశాంత్ వర్మ కు దక్కింది. ఇక భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించేలా ఆద్భుతం సృష్టించింది. కేవలం ఒక చిన్న హీరో సినిమా.. స్టార్ హీరోల సినిమాలకు పోటిగా సంక్రాతి బరిలోకి దిగి సంచలనం సృష్టించింది. ఇక హనుమాన్ మూవీ థియేటర్స్ లో అలరించి సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు తెగ అతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజగా హనుమాన్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయున్నది. ఇంతకి ఎప్పుడంటే..

టాలీవుడ్ లో సంక్రాతికి విడుదలైన అన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిన విషయం తెలిసిందే. కానీ, హనుమన్ సినిమా మాత్రం విడుదలై ఇంతకాలం అవుతున్న.. ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్ లో రన్ అవుతున్న సమయంలో ఓటీటీలోకి వస్తే మూవీ కలెక్షన్స్ కు నష్టం వస్తుందని వెయ్యలేదు. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను పెండింగ్ లో పెట్టారు. అయితే తాజాగా ‘హనుమాన్’ ఓటీటీ రైట్స్ భారీగా కొనుగోలు చేయడమే కాకుండా.. ఆ రోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానుందని సమాచారం అందింది. ఆ వివారాలు ఏంటో చూద్దాం.

హనుమాన్ మూవీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఓటిటి రైట్స్ ను జీ 5 వాళ్లు రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ కు తీసుకున్నారు. అందుకుగాను 30 కోట్లు ఈ రైట్స్ కు చెల్లించినట్లు సమాచారం తెలిసింది. ఇక సినిమా రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత స్ట్రీమ్ చేసేందుకు ఎగ్రిమెంట్ చేసుకున్నా.. థీయేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కారణంతో ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వలేదు. దీంతో సినిమా థియేటర్ లో రన్ పూర్తయ్యే దాకా ఓటిటిని ఆపుతానని మాట ఇచ్చి.. ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమ్ చేసేందుకు ఓకే చేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 8 నుంచి హనుమాన్ మూవీ ఓటిటిలో అన్ని భాషల్లో రానుందని టాక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ థియేటర్ రెవిన్యూ వసూలు చేసింది. దాంతో ఓటిటిలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇక హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పటికే ఈ మూవీ చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కాగా, నైజాంలో అయితే ఇప్పటికి రికార్డ్ లు బద్దలు కొడుతూనే ఉంది. కాగా, ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. అలాగే హనుమాన్ మూవీ తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ వంటి భాషల్లోనూ రిలీజ్ అవటం గమన్హారం. మరి, త్వరలో హనుమాన్ మూవీ ఓటీటీలో అలరించబోతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి