iDreamPost

మందుబాబులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 23న వైన్స్‌ బంద్‌.. కారణమిదే

  • Published Apr 22, 2024 | 8:19 AMUpdated Apr 22, 2024 | 8:19 AM

Wines Close: భాగ్యనగర మందుబాబులకు హైదరాబాద్‌ పోలీసులు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. రేపు అనగా ఏప్రిల్‌ 23న వైన్స్‌ బంద్‌ అని ప్రకటించారు. ఎందుకంటే..

Wines Close: భాగ్యనగర మందుబాబులకు హైదరాబాద్‌ పోలీసులు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. రేపు అనగా ఏప్రిల్‌ 23న వైన్స్‌ బంద్‌ అని ప్రకటించారు. ఎందుకంటే..

  • Published Apr 22, 2024 | 8:19 AMUpdated Apr 22, 2024 | 8:19 AM
మందుబాబులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 23న వైన్స్‌ బంద్‌.. కారణమిదే

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. మత్తు మిమ్మల్ని చేస్తుంది చిత్తు.. మద్యం వల్ల మీ ఇల్లు ఒళ్లు గుల్లవుతుంది.. ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా.. మందు బాబులు చెవికి ఎక్కించుకోరు. ప్రభుత్వాలు కూడా మద్యనిషేధం కోసం గట్టిగా చర్యలు తీసుకోవు. ఎందుకంటే.. దేశంలో చాలా ప్రభుత్వాలు నడిచేది మద్యం ఆదాయం మీదే. ఇక మద్యపానం విషయంలో తెలంగాణ రికార్డు క్రియేట్‌ చేస్తుంటుంది. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల విలువ చేసే మద్యం సేవిస్తుంటారు.

ఇక వేసవి కాలం కావడం.. ఎండలు మండుతుండటంతో.. మనోళ్లు బీర్లు తెగ తాగుతున్నారు. మద్యం వల్ల జరిగే నష్టాలు తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇక వారిని మార్చడం దేవుడి తరం కూడా కాదు. చాలా మంది మందు బాబులకు రోజు చుక్క పడాల్సిందే. లేదంటే విలవిల్లాడిపోతారు. అదుగో అలాంటి వారికి ఇది భారీ షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పవచ్చు. రేపు అనగా ఏప్రిల్‌ 23న వైన్స్‌ బంద్‌ కారణం ఏంటి.. ఎందుకు సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది అంటే..

Huge shocking news for drug addicts

హైదరాబాద్‌ పోలీసులు మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. రేపు అనగా.. ఏప్రిల్‌ 23, మంగళవారం నాడు.. నగరవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త తెలిసి మందు బాబులు బావురుమంటున్నారు. మరి సర్కార్‌ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే.. హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక భాగ్యనగరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమాన్‌ నామం జపిస్తుంటారు.

ఇక మంగళవారం నాడు హనుమాన్‌ జయంతి సందర్భంగా భారీ ఊరేగింపులు, ర్యాలీలు ఉంటాయి. అందుకే ప్రభుత్వం మంగళవారం నాడు మద్యం దుకాణాలు తెరవకూడదనిఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి.. ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మంగళవారం నాడు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

పర్వదినాలు, పండుగ రోజుల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. పర్వదినాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మతపరమైన ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి