iDreamPost

OTT News: మరో OTTలోకి హన్సిక క్రైమ్‌ థ్రిల్లర్‌! మంచి మూవీ మిస్ కావద్దు!

  • Published Feb 26, 2024 | 6:25 PMUpdated Mar 14, 2024 | 4:44 PM

హన్సిక హీరోయిన్ గా నటించిన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హన్సిక హీరోయిన్ గా నటించిన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 26, 2024 | 6:25 PMUpdated Mar 14, 2024 | 4:44 PM
OTT News: మరో OTTలోకి హన్సిక క్రైమ్‌ థ్రిల్లర్‌! మంచి మూవీ మిస్ కావద్దు!

అప్పట్లో తెలుగు హీరోయిన్స్ లో హన్సికకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కొన్ని చిత్రాలతోనే మంచి నేమ్ సంపాదించుకున్న హన్సిక .. కొన్ని సినిమాలతోనే కనుమరుగైపోయింది. ఈ మధ్య కాలంలో హన్సిక సినిమాలు వచ్చి చాలా కాలమే అయిందని చెప్పి తీరాలి . ఇక 2023లో హన్సిక నటించిన చిత్రం “మై నేమ్ ఈజ్ శృతి”. ఈ సినిమాతో నాలుగేళ్ల విరామం త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది హ‌న్సిక‌. కానీ, ఈ సినిమా కూడా హన్సికకు అనుకున్న సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది . ఇక తాజాగా ఈ సినిమా మరో ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుందట.

ఓటీటీ లకు బాగా ఆదరణ పెరిగిపోతున్న క్రమంలో.. కొన్ని సినిమాలు ఒకటి ..లేదా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హన్సిక నటించిన “మై నేమ్ ఈజ్ శృతి” కూడా యాడ్ అయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ఓంకార్ .. ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీగా.. హ‌న్సికకు యాక్టింగ్ పరంగా మంచి పేరే వచ్చినా .. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం సినిమా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక ఈ మూవీలో ముర‌ళీశ‌ర్మ‌, న‌రేన్‌, పూజా రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక ఈ సినిమా తాజాగా ఫిబ్రవరి 28 నుంచి ఆహ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. హన్సిక ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో.. అమ్మ , తాత ఆమెను గారాబంగా పెంచుతారు. అంత సాపిగా సాగిపోతున్న సమయంలో స్కిన్ మాఫియా ముఠా కు సంబంధించిన ఉచ్చులో చిక్కుకుంటుంది. ఆ ముఠాలో ప్రధాన వ్యక్తి చేస్తున్న అక్రమాలన్ని హన్సికకు తెలుస్తాయి. ఆ తర్వాత హన్సిక ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి ! స్కిన్ మాఫియాను ఎలా పట్టిస్తుంది. అసలు దాని వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరు ! అనేదే ఈ సినిమా కథ. ఇవన్నీ తెలియాలంటే .. ఈ సినిమా చూసేయాల్సిందే. ఇక రాబోయే ఓటీటీ లో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి, “మై నేమ్ ఈజ్ శృతి” మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి