iDreamPost

ఫేర్‌వెల్‌డేలో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

స్కూల్లో ఫేర్ వెల్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఓ విద్యార్థిని మాత్రం ఫేర్ వెల్ డే లో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లింది. ఆ తర్వాతర ఏం జరిగిందంటే?

స్కూల్లో ఫేర్ వెల్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఓ విద్యార్థిని మాత్రం ఫేర్ వెల్ డే లో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లింది. ఆ తర్వాతర ఏం జరిగిందంటే?

ఫేర్‌వెల్‌డేలో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇటీవల కొందరు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారి కలలను కాలరాస్తూ తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇటీవల భువనగిరిలో ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సూర్యపేటలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాలలో ఫేర్ వేల్ డేలో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కు చేరవేశారు. అసలు ఏం జరిగిందంటే?

సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి. ఈమె సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాగా గురుకుల పాఠశాలలో శనివారంనాడు ఫేర్ వెల్ డే ఉండడంతో తమ కూతురుకు పూలు, గాజులు ఇచ్చి వెళ్లాడు తండ్రి. పాఠశాలలో జరిగిన ఫేర్ వెల్ డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఓవైపు ఫేర్ వెల్ డే జరుగుతుండగానే హాస్టల్ గదిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చి చూసిన విద్యార్థినులు వైష్ణవి అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైష్ణవిని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే వైష్ణవి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

వైష్ణవి మృతిచెందిన విషయాన్ని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైష్ణవి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా తమ కూతురు వైష్ణవి మృతికి ప్రిన్సిపాలే కారణమంటూ వారు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమ కూతురు ఇంటికి వచ్చినప్పుడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్‌లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పిందని వెల్లడించారు.

వెంటనే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఫోన్‌లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి