iDreamPost

ఇంటి వద్ద పాలు పోస్తూనే సాధన..  జాతీయ స్థాయిలో పతకం

ఇంటి వద్ద పాలు పోస్తూనే సాధన..  జాతీయ స్థాయిలో పతకం

సాధించాలనే సంకల్పం ఉంటే.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలి. అలా పేదరికాన్ని, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్ని విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చేరారు షేక్ మొహిద్దీన్.  ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. అచంచల ఆత్మవిశ్వాసంతో  తన లక్ష్యం కోసం సాధాన చేశారు. పార్ట టైమ్ ఉద్యోగం చేస్తూనే రాణిస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఖోలో ఇండియా నేషనల్స్ కాంస్య పతకం గెలిచి.. తన సత్తా చాటారు. మరి.. అతడు తన లక్ష్యం చేరుకునే క్రమంలో పడిన ఇబ్బందులు, అతని లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది జీవితంలో చిన్న చిన్న సమస్యలు రాగానే తమ లక్ష్యాన్ని పక్కపెట్టేస్తారు. కొందరు ఆర్థిక ఇబ్బందులకు, మరికొందరు పేదరికంతో తమ లక్ష్యాన్ని మరిచిపోయీ.. చరిత్రలో కనుమరుగై పోతుంటారు. కానీ షేక్ మొహిద్దీన్ అలా కాదు.. కష్టాలను ఎదుర్కొంటూ.. సమస్యలు శాశ్వాతం కాదని, విజయంతో వచ్చే గుర్తింపే శాశ్వతమని బలంగా నమ్మాడు. అందుకే  తండ్రి మరణించిన.. కుటుంబానికి అండగా ఉంటూ జాతీయ  స్థాయిలో పతకం సాధించారు.

గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన వ్యక్తి  మొహిద్దీన్. ఆయన తండ్రి షేక్ షంషూద్దీన్ పదేళ్ల క్రితం మరణించారు. తల్లి నూర్జహాన్ గృహిణి. ఇంటి వద్దే పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతేకాక సమయం దొరికినప్పుడుల్లా కూలి పనుల చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలిస్తున్నారు. పగలంతా కూలీ పనులు చేస్తూ రాత్రి సమయంలో హైజంప్  సాధన చేసేవారు. అలానే తన సాధనతో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి మొహిద్దీన్ ఎదిగారు. ఏ పోటీలకు వెళ్లినా పతకంతోనే ఇంటికి వచ్చే వారు.

ఇప్పటి వరకు 20కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10 బంగారు, మరో 10 రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏడు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్ని ఉత్తమ ప్రతిభ కనబరిచారు  పూర్తిగా సాధనలో నిమగ్నమైతే  త్వరలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ముందని అతని శిక్షకులు అంటున్నారు.  అయితే ఆర్థిక ఇబ్బందులు కారణంగా వీలు కావడం లేదు. ఎవరైన పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్ షిప్ ఇప్పించాలని  అతడు కోరుతున్నాడు. మరి. ఈ మట్టిలో మాణిక్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి