iDreamPost
android-app
ios-app

గులాబి బ్యూటీ మహేశ్వరి ఇంతలా మారిపోయిందేంటీ..?

Actress Maheswari Latest Video: హీరోయిన్లకు ఒక్క మూవీ చాలు స్టార్ డమ్ హోదా రావడానికి. అభిమానుల మదిలో నిలిచిపోతే వారి గుండెల్లో గుడి కట్టేసుకుంటారు. ఇదిగో ఈ హీరోయిన్ కూడా ఆ కోవకే వస్తుంది. గులాబీ అతనే ఒక్క సినిమాతోనే క్రష్ అయిపోయింది. ఆ నటి మరెవ్వరో కాదూ..

Actress Maheswari Latest Video: హీరోయిన్లకు ఒక్క మూవీ చాలు స్టార్ డమ్ హోదా రావడానికి. అభిమానుల మదిలో నిలిచిపోతే వారి గుండెల్లో గుడి కట్టేసుకుంటారు. ఇదిగో ఈ హీరోయిన్ కూడా ఆ కోవకే వస్తుంది. గులాబీ అతనే ఒక్క సినిమాతోనే క్రష్ అయిపోయింది. ఆ నటి మరెవ్వరో కాదూ..

గులాబి బ్యూటీ మహేశ్వరి ఇంతలా మారిపోయిందేంటీ..?

ఒక్క సినిమా.. ఒకే ఒక్క మూవీ హీరో హీరోయిన్లను ఓవర్ నైట్ స్టార్ చేసేస్తుంది. ఇప్పుడే కాదూ గతంలో కూడా ఈ ఫార్ములా ఫ్రూవ్ అయ్యింది. అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఓ సూపర్ హిట్ మూవీతో స్టార్ డమ్ తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఆఫర్లు వెల్లువలా వస్తుంటాయి. ఓ ఐదారేళ్లు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో రెండు మూవీస్ హిట్టైనా దశాబ్ద కాలం తిరుగుండదు. ఇప్పుడు మనం ప్రస్తావించబోయే నటి కూడా అంతే. ఒక్క మూవీ, ఒక్క పాటతో అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టేసుకుంది. ఓ తరానికి.. క్రష్ హీరోయిన్ ఆమె. ఇలాంటి లవర్ మనకు ఉండే ఎంత బాగుండో అనుకున్నారు అప్పటి యూత్.

‘ఏరా చందు.. ఏం చేస్తున్నావ్’ అంటూ గిలిగింతలు పెట్టిన నటి గుర్తుందా.. ఇలా అయితే ఆమె ఎవరో చెప్పకపోవచ్చు కానీ.. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ అని పాడగానే సింగర్ సునీతతో పాటు మదిలో మెరిసే నటి మహేశ్వరి. గులాబి మూవీలో ఆమె యాక్టింగ్‌ను చూస్తే ఫిదా కానీ యువకులు బహుశా ఉండరేమో. తన  ముద్దు ముద్దు మాటలతో, చబ్బీ చీక్స్ తో కట్టిపడేసిన మహేశ్వరి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి. తాజాగా అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు, దేవర బ్యూటీ జాన్వీతో కలిసి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరుని సందర్శించింది. ఇప్పుడు ఆమెను చూస్తే గుర్తు పట్టలేనంత ఛేంజ్ అయ్యింది. శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అనుకుంటారు కానీ.. కాదూ.. మహేశ్వరి అమ్మకు శ్రీదేశి చెల్లెలు. అంటే ఆమెకు శ్రీదేవి పిన్ని అవుతుంది. అయితే తొలి నుండి అక్క అని పిలుస్తూ ఉండటంతో అందరూ శ్రీదేవి తనకు అక్క అనుకునే వారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహి.

శ్రీదేవి బంధువు అయినప్పటికీ.. తన నటనతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అమ్మాయి కాపురం మూవీలో కనిపించినప్పటికీ.. ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. చక్రవర్తితో వరుసగా సినిమాలు చేసింది. దెయ్యం, మృగం సినిమాలకు ఓకే అనిపించాయి. ఆ తర్వాత వచ్చిన పెళ్లి అప్పట్లో సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత ప్రియరాగాలు, మా బాలాజీ, ప్రేమించేది ఎందుకమ్మా, నీకోసం వంటి చిత్రాలు చేసింది. మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశా మూవీలో ఓ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత సినిమా నుండి దూరం అయ్యింది. కావాలనే ఇండస్ట్రీకి దూరమయ్యానని చెప్పింది. ఆ తర్వాత టివి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మై నేమ్ ఈజ్ మంగతయారు ధారావాహికతో నవ్వించింది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది మహేశ్వరి. మరీ ఈ బ్యూటీ సినిమాల్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet