iDreamPost

టాలీవుడ్లో కలకలం!.. ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్..

టాలీవుడ్లో కలకలం!.. ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్..

ప్రభాస్ సన్నిహితులచే స్థాపించబడి కేవలం ప్రభాస్, ఆయన సన్నిహితులతోనే సినిమాలు చేస్తూ వస్తోంది యూవీ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ క్రమంలో ఈ సంస్థపై జీఎస్టీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద జీఎస్టీ అధికారులు రైడ్స్ జరిపిన విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల మీద సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు విడుదల చేసిన సమయంలో పన్ను ఏదైనా ఎగవేశారా? అనే విషయం మీద అధికారులు తనిఖీ చేసి ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

GST Raid on Popular Telugu Production House UV Creations!

ఈ విషయం మంగళవారం పొద్దుపోయే వరకు బయటకు రాలేదు. ఈ విషయం మీద జీఎస్టీ అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోగా యూవీ క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి తనిఖీలు సర్వసాధారణం అని గతంలో కూడా జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరిగాయని చెబుతోంది. యువీ క్రియేషన్స్ సంస్థను హీరో ప్రభాస్ వరుసకు సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి ముంబై బేస్ తో 2013వ సంవత్సరంలో స్థాపించారు.

Prabhas gets hospitalised, undergoes surgery

ఈ సినిమా నుంచి మొదటి సినిమాగా ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ కు సన్నిహితంగా ఉన్న వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ నిర్మాణ సంస్థ నాని హీరోగా భలే భలే మగాడివోయ్, శర్వానంద్ హీరోగా ఎక్స్ప్రెస్, రాజా రన్ రాజా రన్, మహానుభావుడు గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ, అనుష్క హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు నిర్మించారు.

Prabhas Adipurush Remuneration: Has Prabhas charged Rs 150 crore for  'Adipurush'?

ఇప్పుడు కూడా ఆది పురుష్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అన్ని కోట్ల రూపాయలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ సందర్భంగా జీఎస్టీ ఏమైనా ఎగ్గొడుతున్నారా అనే విషయం మీద జిఎస్టి రైట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద జీఎస్టీ అధికారిక ప్రకటన చేస్తే కానీ పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి