iDreamPost

కేంద్రం షాకింగ్ నిర్ణయం! వాటిపై 28 శాతం GST..

  • Author Soma Sekhar Published - 10:06 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 10:06 PM, Tue - 11 July 23
కేంద్రం షాకింగ్ నిర్ణయం! వాటిపై 28 శాతం GST..

కేంద్ర ప్రభుత్వం ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో మంగళవారం వస్తు సేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది జీఎస్టీ మండలి. ఇక నుంచి వాటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించింది మండలి. మరి వేటిపై జీఎస్టీని విధిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో మంగళవారం జీఎస్టీ 50వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది మండలి. ఆన్ లైన్ గేమింగ్, కేసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీని విధించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. వీటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని గతంలోనే మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్ కు సిఫార్సు చేసింది. దీనిపై పలుమార్లు సమావేశంలో చర్చ జరిగినప్పటికీ అప్పుడు అమలుకు నోచుకోలేదు. తాజాగా జరిగిన మండలి సమావేశంలో ఆన్ లైన్ గేమింగ్, కేసినో, గుర్రపు పందేలు పై 28 జీఎస్టీ విధించాలని ఏకాభిప్రాయానికి వచ్చింది మండలి.

గతంలో వీటిని 18 శాతం జీఎస్టీ శ్లాబ్ లోనే ఉంచాలని ఆన్ లైన్ గేమింగ్ నుంచి డిమాండ్లు వచ్చాయి. అయినప్పటికీ తాజా భేటీలో 28 శాతం శ్లాబ్ లోనే చేర్చింది. ఈ శ్లాబ్ లో ఇప్పటికే.. పాన్ మసాలా, కార్బోనేటెడ్ డ్రింక్స్, పొగాకు, సిగరెట్స్, టైర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్స్, స్మోకింగ్ పైప్స్ లాంటివి ఉన్నాయి. సీన్ గూడ్స్ అంటేనే పాపపు వస్తువుల్నే ఎక్కువ GST లో చేరుస్తారు అన్న ప్రచారం వ్యాప్తిలో ఉంది. దానర్థం.. ప్రజలకు హాని చేసే వస్తువులపై ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నట్లు.

ఇదికూడా చదవండి: వీడియో: అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం.. బజ్జీలు తినడానికి సైరన్ వేసుకుని మరీ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి