iDreamPost

వీడియో: అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం.. బజ్జీలు తినడానికి సైరన్ వేసుకుని మరీ..!

  • Author Soma Sekhar Published - 08:15 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 08:15 PM, Tue - 11 July 23
వీడియో: అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం.. బజ్జీలు తినడానికి సైరన్ వేసుకుని మరీ..!

ప్రజల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్స్ లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొందరు ఆకతాయి డ్రైవర్లు చేసే నిర్వాకాలు చూసే వారికి ఎక్కడ లేని కోపాన్ని తెప్పిస్తాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ట్రాఫిక్ లో అంబులెన్స్ సైరన్ మోగించడంతో.. సిగ్నల్ దాటించారు ట్రాఫిక్ పోలీసులు. కానీ సిగ్నల్ దాటాక ఆ డ్రైవర్ చేసిన నిర్వాకం చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. ఈ సంఘటనను ట్రాఫిక్ పోలీసు వీడియో తీయగా.. డీజీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు.. చూసిన వారికి కోపాన్ని తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ మోగించడంతో.. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యి సిగ్నల్ ను క్లియర్ చేశారు. దాంతో సిగ్నల్ ను దాటింది అంబులెన్స్. ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. సిగ్నల్ దాటి ముందుకు వెళ్లిన అంబులెన్స్ రోడ్డు పక్కన ఆగింది. అక్కడ ఆస్పటల్ ఉందా? అంటే లేదు. కానీ అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపి.. బజ్జీలు, కూల్ డ్రింక్ లు కొనుక్కున్నాడు.

ఇది గమనించిన పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అంబులెన్స్ దగ్గరికి వచ్చి డ్రైవర్ ను ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులు. అంబులెన్స్ లో రోగి ఉన్నాడనుకొని మేం ట్రాఫిక్ క్లియర్ చేస్తే.. నువ్వు వచ్చి బజ్జీలు, కూల్ డ్రింక్స్ కొనుక్కుంటున్నావా? అంటూ ప్రశ్నించారు. అయితే వాహనంలో రోగి ఉన్నాడని డ్రైవర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకెప్పుడు ఇలా చేయోద్దని డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చాడు ట్రాఫిక్ పోలీసులు. ఈ దృశ్యాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో తీశారు. ఇక ఈ వీడియోను డీజీపీ అంజనీ కుమార్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించే సైరన్ ను దుర్వినియోగం చేయెుద్దంటూ అంబులెన్స్ డ్రైవర్ కు సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి: తనకు క్యాన్సర్ ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కొడాలి నాని!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి