iDreamPost

మహిళల కోసం అదిరిపోయే స్కీం .. ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ కోసం ఇలా అప్లై చేసుకోండి

  • Published Apr 03, 2024 | 2:44 PMUpdated Apr 03, 2024 | 2:44 PM

కేంద్ర ప్రభుత్వ ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మహిళల కోసం మరొక ప్రత్యేకమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మహిళల కోసం మరొక ప్రత్యేకమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Published Apr 03, 2024 | 2:44 PMUpdated Apr 03, 2024 | 2:44 PM
మహిళల కోసం అదిరిపోయే స్కీం .. ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ కోసం ఇలా అప్లై చేసుకోండి

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి.. వారికి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తుంది. దేశంలోని ఎంతోమంది సామాన్య ప్రజలకు, మహిళలకు అండగా ఉంటూ.. వారికీ ఉపాధి కూడా కల్పించేందుకు.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నో పథకాలను వారి ముందు ఉంచింది. ఈ పథకాల ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ది పొందుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా.. మహిళలకు మరొక బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం ప్రకారం.. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడంతో పాటు.. గ్యాస్ స్టవ్ ను కూడా ఉచితంగా అందించనుంది. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. మరి, ఈ గ్యాస్ సిలిండర్లను పొందడానికి ఎవరు అర్హులు, ఎవరు వీటిని అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద బీలో పావర్టీ లైన్ కింద ఉన్న మహిళలకు మాత్రమే.. ఈ గ్యాస్ సిలిండర్స్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ గ్యాస్ కావాలంటే ముందుగా ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం మీ అమౌంట్ ను మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సామాన్యుల కోసం అమలు చేసే ఎన్నో పథకాలలో ఇది కూడా ఒకటి. ఆర్ధికంగా వెనుక పడిన ఎందరో మహిళలకు ఈ పథకాలు సహాయపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద.. 10కోట్ల మందికి పైగా మహిళలకు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ అందజేస్తుంది. దీనిని అధికారిక వెబ్ సైట్ https://www.pmuy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

An exciting scheme for women

అయితే, ఈ ఉచిత సిలిండర్ ను పొందాలంటే.. ఆ మహిళల కనీస వయస్సు.. 18 ఏళ్ళు పైబడి ఉండాలి. అలాగే వారి కుటుంబ వార్షిక ఆదాయం.. గ్రామీణ ప్రాంతాలలో లక్ష రూపాయలు, పట్టణాలలో రెండు లక్షల రూపాయలు మించి ఉండకూడదు. కాగా, ఈ మహిళలు భారత్ గ్యాస్ , హెచ్ పీ గ్యాస్ , ఇండియన్ గ్యాస్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలను ఎన్నుకోవచ్చు. ఇక ఇవి అప్లై చేసుకోవాలంటే.. వారు.. క్యాస్ట్ సరిఫికేట్, ఇన్ కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఆ తర్వాత వెబ్ సైట్ ఓపెన్ చేసి.. అక్కడ సూచించిన విధంగా సరైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత.. దానిని ప్రింట్ అవుట్ తీసుకుని.. గ్యాస్ ఏజెన్సీ కి ఆ ఫార్మ్ ను సమర్పించాలి. ఇలా మహిళలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి