iDreamPost

మీసం తిప్పడం నుండి.. బూట్లు తుడవడం వరకు..

మీసం తిప్పడం నుండి.. బూట్లు తుడవడం వరకు..

నాలుగు రోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జెసి దివాకర్ రెడ్డి వైసిపి పాలన, జగన్ వైఖరి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పోలీసులందరు వంగి వంగి దణ్ణాలు పెడుతూ తెలుగుదేశం నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వాలు శాశ్వతం కాదు తమ ప్రభుత్వం వచ్చాక బూట్లు నాకే పోలీసులు ని తీసుకొచ్చి పెట్టుకొని తిరిగి మీ మీదే కేసు పెడతామని పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే మరోసారి పోలీసు శాఖ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చినీయాంశంమైంది. దీనిపై పొలిసు అధికారుల సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యాలను ఖండించారు.

ఈ నేపథ్యంలో హిందూపూర్ యం.పి గోరంట్ల మాధవ్ జెసి దివాకర రెడ్డి వ్యాఖ్యలపై మీడియా సమక్షంలోనే బూట్లు తుడుస్తూ తన నిరసనని తెలియజేశారు.

అసలు విషయంలోకి వెళితే గోరంట్ల మాధవ్ జెసి దివాకర్ రెడ్డి ల మధ్య తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం, పరస్పర సవాళ్లు విసురుకోవడం గత సంవత్సర కాలం నుండి జరుగుతూనే ఉంది, అసలు దీని వల్లె ఒక సాధారణ సి.ఐ గా ఉన్న గోరంట్ల మాధవ్ కి ఇంత గుర్తింపు తెచ్చి పెట్టడమే కాక ఒక సాధారణ పోలీసుని అనతికాలంలోనే పార్లమెంట్ లో అడుగుపెట్టేలా చేసింది. వినడానికి ఇదంతా ఎదో పవర్ ఫుల్ పొలిసు ఆఫీసర్ సినిమాల్లో మాత్రమే జరగడం మనం చూడొచ్చేమో కానీ నిజ జీవితంలో వాస్తవంగానే ఇలా జరగడం చాలా చాలా అరుదు. మామూలు గా అయితే అప్పటివరకు ఇలాంటి కధలని మనం ఏ సాయి కుమారో.. రాజశేఖర్ లాంటోళ్ళు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం కానీ ఇక్కడ నిజజీవితంలో అదీ మన రాష్ట్రంలో జరగడం బహుశా ఇదే మొదటి సారి కావొచ్చు.

సరిగ్గా ఒక్క సంవత్సరం వెనక్కి వెళితే… అప్పట్లో 2018 సెప్టెంబర్ లో అనంతపురం యంపీ గా జెసి దివాకర్ రెడ్డి ఉన్న సమయంలో సొంత నియోజకవర్గం తాడిపత్రిలో వినాయక చవితి చందాల విషయంలో గ్రామస్థులకు ఆ గ్రామంలో ఆశ్రమం నిర్వహిస్తున్న ప్రభోదానంద స్వామి శిష్యుల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీయడం ఆ ఘర్షణల్లో పలువురు గాయపడడం, పొలిసు కాల్పులకు దారితీయడంతో, గ్రామస్థులకు మద్దతుగా యంపీ జెసి దివాకర్ రెడ్డి ప్రభోధానందని అతని శిష్యులని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేయడంతో పాటు (వాస్తవంగా అప్పటికే దివాకర్ రెడ్డి కి ప్రబోధనంద కి మధ్య గొడవలు ఉన్నాయి) ఆ అల్లర్ల లో పోలీసులు ప్రభోదానందకు ఆయన శిష్యులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మీడియా ముఖంగా

పోలీసులపై తీవ్ర పదజాలాన్ని వాడుతూ జెసి దివాకర్ రెడ్డి వారిని తీవ్ర పదజాలంతో దూషించడంతో..

పోలీసులపై యంపీ వ్యాఖ్యలను ఖండిస్తూ అప్పటి అనంతపురం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సాకే త్రిలోకా నాద్, సెక్రటరీ గా ఉన్న అప్పటి కదిరి సి.ఐ గా ఉన్న గోరంట్ల మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చెయ్యడం ఆ సమావేశంలో గోరంట్ల మాధవ్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా దివాకర్ రెడ్డిని ఉద్దేశించి ఈసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని తీవ్ర పదజాలంతో హెచ్చరించడం దానికి ప్రతిగా జెసి దివాకర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి అనంతపురం క్లాక్ టవర్ దగ్గర తేల్చుకుందామని గోరంట్ల మాధవ్ కి సవాలు విసరడంతో వీరిరువురి సవాళ్లు ప్రతి సవాల్ పర్వం మీడియాలో తీవ్ర చర్చకి దారితీసింది. దింతో రాష్రావ్యాప్తంగా జనం ఒక్కసారిగా గా ఉలిక్కిపడి ఎవరా ఈ గోరంట్ల మాధవ్ అని ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే గోరంట్ల మాధవ్ కి జిల్లా వ్యాప్తంగా మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నఆయన సొంత సామాజికవర్గంలో విపరీతమైన హీరోయిటిక్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

తదనంతరం జరిగిన పరిణామాల్లో ప్రభుత్వం నుండి మాధవ్ మీద వత్తిళ్లు ఎక్కువ అవడం, ఆయన స్వచ్చంద పదవి విరమణ కి సిద్ధపడడం ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తో.. జిల్లాలో గణనీయమైన బిసి ఓటు బ్యాంకుని దృష్టిలో పెట్టుకొని అప్పటికే బలమైన బిసి అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న అప్పటి ప్రతిపక్షం వైసిపి బిసిల్లో మంచి క్రేజ్ సంపాదించిన గోరంట్ల మాధవ్ కి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని పార్టీలోకి ఆహ్వానించింది.

అయితే మాధవ్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించ కుండా తాత్సారం చేసింది. మరో వైపు వైసీపీ తరుపున హిందువుర్ లోక సభ బరిలో మాధవ్ నిలుస్తున్నాడని ప్రచారం జరిగింది. నామినేషన్ల గడువు మరో మూడు రోజుల్లో ముగుస్తాయనగా కూడా మాధవ్ రాజీనామా ఆమోదం పొందలేదు.మాధవ్ స్థానంలో ఆయన సతీమణిని పోటీకి దించటానికి ప్రయత్నాలు జరిగాయి… ఎట్టకేలకు నామినేషన్లు ముగియటానికి రెండు రోజుల ముందు మాధవ్ నామినేషన్ ఆమోదం పొందింది.

మాధవ్ నామినేషన్ వేసిన రెండు రోజులకే వారి తండ్రి మరణించారు. హిందూపూర్ లోక్ సభ పరిధిలోని ఏడు శాసనసభ పరిధిలో కనీసం ఒక్క రోజు కూడా ప్రచారం చేయటానికి సమయం లేని పరిస్థితిలో కూడా తెలుగుదేశం సిట్టింగ్ యంపీ మరో బలమైన ప్రముఖ బిసి నేత నిమ్మల కిష్టప్ప పై మాధవ్ ఒక లక్ష నలభై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టాడు.

కేవలం 4,5 నెలల్లోనే ఒక సాధారణ కింది స్థాయి పొలిసు అధికారి నుండి యంపీగా ఎన్నికై దేశంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్ లో అడుగుపెట్టిన గోరంట్ల మాధవ్ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీని మించిపోయిందని చెప్పవచ్చు.

నాలుగు దశాబ్దాలు ప్రజాప్రతినిధిగా ఉన్న దివాకర్ రెడ్డి ఈరోజు సమన్వయం పాటించలేదు.ఆయన నోటికి దడవని అధికారులు,ప్రత్యర్ధులు లేరంటే అతిశయోక్తి కాదు. మాధవ్ మాత్రం పోలీస్ అధికార గా మీసం తిప్పి సవాల్ విసిరిన మాధవ్ మాత్రం ఎంపీ గా ఎన్నికయిన తరువాత సమన్వయం పాటిస్తూ బూట్లు తుడిచి వాటిని ముద్దు పెట్టుకొని దివాకర్ రెడ్డి మాటలకు నిరసన ప్రకటించాడు… ఈ మార్పు శాశ్వతమైతే మాధవ్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించటం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి