iDreamPost

జీ మెయిల్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. లక్షల ఖాతాలు డిలీట్..!

ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు.. ఫేస్ బుక్ ఓపెన్ చేయాలన్నా, ఏదన్నా షాపింగ్ చేయలన్నా, యూట్యూబ్ వీడియోలు చూడాలన్నా అడిగే ఆప్షన్ ఫోన్ నంబర్ లేదా జీమెయిల్ నెంబర్. చాలా మంది ఈ క్రమంలోనే జీమెయిల్ ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. అయితే..

ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు.. ఫేస్ బుక్ ఓపెన్ చేయాలన్నా, ఏదన్నా షాపింగ్ చేయలన్నా, యూట్యూబ్ వీడియోలు చూడాలన్నా అడిగే ఆప్షన్ ఫోన్ నంబర్ లేదా జీమెయిల్ నెంబర్. చాలా మంది ఈ క్రమంలోనే జీమెయిల్ ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. అయితే..

జీ మెయిల్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. లక్షల ఖాతాలు డిలీట్..!

ఇప్పుడంతా టెక్నాలజీదీ హవా.. విద్యా రంగం నుండి వైద్య రంగం వరకు డిజిటలైజ్డ్ అయిపోయింది. సాంకేతిక అందిపుచ్చుకోవడంతో ఆకాశంపైకి మానవ సహిత అంతరిక్షను పంపేందుకు సిద్ధమైంది భారత్. ఇక సోషల్ మీడియా హవా అంతా ఇంతా కాదు. ఇంటర్నెట్ మరింత అందుబాటులోకి వచ్చాక యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. దీంతో మేసేజింగ్, చాటింగ్, వీడియో కాలింగ్ ఈజీ అయిపోతుంది. ఏదైనా ఒక డాక్యుమెంట్ పంపించాలంటే వెంటనే వాట్సప్ నుండి షేర్ చేసేస్తున్నారు. కానీ గతంలో ఓ డాక్యుమెంట్ పంపించాలంటే ఉన్న ఏకైక సాధనం జీమెయిల్ మాత్రమే. సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థకు చెందిన ఒక ఆప్షన్ జీమెయిల్. జీమెయిల్ అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీమెయిల్ ఉంటుంది.

అయితే ఇప్పుడు గూగుల్ సంస్థ వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది జీమెయిల్ ఖాతాలను తొలగించేందుకు సిద్ధమైంది. యాక్టివ్ లో లేని ఖాతాలను డిలీట్ చేయనుంది. వచ్చే నెలలో ఈ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. గత రెండెళ్ల పాటు అచలన స్థితిలో(వినియోగించని) ఉన్న ఖాతాలను డీయాక్టివేట్ చేయనుంది. దీంతో లక్షలాది జీ మెయిల్ ఖాతాలు డిలీట్ కానున్నాయి. ఈ మేరకు మేలోనే గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రికెలీ తన బ్లాగులోనే పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మీట్, గూగుల్ క్యాలెండర్.. వీటిల్లో ఏదైనా వినియోగించకపోయినా.. కంటెంట్‌తో సహా అన్ని పోనున్నాయి.

కొంత మంది జీమెయిల్ ఖాతాలు ఉన్నట్లే మర్చిపోయారు. వాటి పాస్ వర్డ్స్ మరచిపోవడంతో వాటిని వినియోగించడం లేదు. కొంత మంది సరైన సెట్టింగ్స్ చేయలేదు. టూ స్టెప్ వెరిఫికేషన్ లేని అకౌంటర్లను తొలగిస్తున్నామని గూగుల్ పేర్కొంటోంది. ఎవరి ఖాతాలు పోతాయంటే..గత రెండేళ్లుగా జీమెయిల్స్ ఖాతాను వినియోగించనివే డిలీట్ అవుతాయని పేర్కొంది. అయితే ఇప్పుడు యాక్టివ్ చేసుకోవాలనుకుంటే.. గూగుల్ బ్లాగ్ పోస్టు ప్రకారం.. గూగుల్ ఖాతాను రెండు సంవత్సరాల ఒకసారి సైన్ ఇన్ చేయాలి. ఇటీవల గూగుల్ సంబంధించిన సేవల్లో దేనికైనా సైన్ చేసి ఉంటే.. అటువంటి ఖాతాలను తొలగించదు. అలాంటి ఖాతాలను యాక్టివ్ అకౌంట్స్ గానే పరిగణిస్తుంది. అందులోకి లాగిన్ అయ్యి మెయిల్స్ పంపడం, గూగుల్ డడ్రైవ్, ఆ అకౌంట్ లో నుండ యూట్యూబ్ వీడియోలు చేయడం, ఆ మెయిల్ ఖాతా నుండి గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్ లోడ్, సెర్చ్ చేయడం ద్వారా కూడా మీ ఖాతాను పరిరక్షించుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి