iDreamPost

ప్లేస్టోర్ నుంచి ఆ మేజర్ యాప్స్ తొలగింపు.. కారణం ఏంటంటే?

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ యాప్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అసలు యాప్స్ కు తొలగింపుకు కారణం ఏంటంటే?

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ యాప్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అసలు యాప్స్ కు తొలగింపుకు కారణం ఏంటంటే?

ప్లేస్టోర్ నుంచి ఆ మేజర్ యాప్స్ తొలగింపు.. కారణం ఏంటంటే?

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ ప్లే స్టోర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏదైన యాప్ కావాలంటే ప్లే స్టోర్ ను ఆశ్రయించాల్సిందే. ఇంటర్నెట్ సాయంతో ప్లే స్టోర్ నుంచి పలు రకాల యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని యూజ్ చేస్తుంటారు యూజర్లు. గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నోరకాల యాప్స్ ఉంటాయి. వీటిల్లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ కొన్ని ఉండగా, మరికొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి. ఈ పెయిడ్ యాప్స్ కు మనీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజాగా దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ యాప్ లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇంతకీ అవి ఏయే యాప్స్? తొలగించడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ పాలసీని ఉల్లంఘించినందుకు ప్రముఖ యాప్స్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 10 యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన వాటిల్లో ప్రముఖ భారత మ్యాట్రిమోనియల్ యాప్స్ షాదీ. కామ్, భారత్ మ్యాట్రిమోనీ, జాబ్ యాప్ నౌకరీ, 99ఎకర్స్, స్టేజ్, ఆల్ట్‌బాలాజీ, కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ, స్టేజ్ ఓటీటీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాను కూడా గూగుల్ తొలగించింది.

సర్వీస్ ఫీజులు చెల్లించకపోవడం కారణంగా గూగుల్ ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. గూగుల్ ప్లాట్ ఫాం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ సర్వీస్ ఫీజులు మాత్రం చెల్లించడం లేదంటూ గూగుల్ తెలిపింది. కాగా గూగుల్ సర్వీస్ ఫీజు కింద యాప్స్ నుంచి 11 నుంచి 26 శాతం వసూలు చేస్తోంది. కొన్ని సంస్థలు సర్వీస్ ఫీజు చెల్లించడంలేదన్న కారణంతో గూగుల్ ఆ యాప్స్ పై చర్యలు తీసుకుంది. ఇక గూగుల్ తీరుపై ఆయా కంపెనీల వ్యవస్తాపకులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఫీజు చెల్లించి తిరిగి ప్లే స్టోర్ లోకి అడుగుపెడతామని వెల్లడిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి