iDreamPost

గోడపైకి ఎక్కిన రైలు.. ఈ ప్రమాదం ఎక్కడంటే?

Rail Accident: తరచూ రైలు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు, ఇటీవలే నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా ఓ గూడ్స్ రైలు ఏకంగా గోడపైకి ఎక్కింది.

Rail Accident: తరచూ రైలు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు, ఇటీవలే నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా ఓ గూడ్స్ రైలు ఏకంగా గోడపైకి ఎక్కింది.

గోడపైకి ఎక్కిన రైలు.. ఈ ప్రమాదం ఎక్కడంటే?

తరచూ ఏదో  ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. సాంకేతిక సమస్య, ఇతర కారణాలతో రైళ్లు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఇక రైలు ప్రమాదాలు జరిగిన ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొన్ని ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. కొన్ని నెలల క్రితం ఒరిస్సాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అనేక చిన్న చిన్న రైలు ప్రమాదాల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరువక ముందే పెద్దపల్లిలో మరో రైలు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది.  రామగుండం సమీపంలోనే క్యారేజ్ అండ్ వ్యాగన్ ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. లూప్ లైన్ లో నిలిచిన ఉన్న మిషన్ ను గూడ్స్ రైలు భోగీలు కొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో  8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి.  గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఆపరేటర్‌ ఎలాంటి  ప్రాణాపాయం సంభవించలేదు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ట్రాక్ ను పునరుద్దరిస్తున్నారు. ఇటీవలే చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.  నాంపల్లి స్టేషన్ లో ఆగాల్సిన రైలు.. ఆగకుండా..వేగంగా వెళ్లి.. ఎడ్జ్ లో ఉన్న గోడను ఢీ కొట్టింది. ఆ వేగానికి చార్మినార్ రైలుకు సంబంధించిన నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురుకి గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులతో పాటు స్థానికులు భయాందోళకు గురయ్యారు. గతంలో కూడా పలాస ప్యాసెంజర్ రైలు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో చాలా మంది మృతి చెందారు.  మరి..ఈ రైలు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి