iDreamPost

వలస కార్మికులకు తీపి కబురు చెప్పిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

వలస కార్మికులకు తీపి కబురు చెప్పిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

మధ్యప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు శుభవార్త తెలిపింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను వెనక్కు రప్పించడానికి ప్రయత్నిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

దేశంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను వెనక్కు రప్పించడానికి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చలు జరిపారు. తమ రాష్ట్రాలలో చిక్కుకున్న కార్మికులను మధ్యప్రదేశ్ కు పంపడానికి అన్నివిధాల సహాయం చేస్తామని ఆయా రాష్ట్రల ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కు హామీ ఇచ్చారు. దీంతో మధ్యప్రదేశ్ వలస కార్మికుల కష్టాలు తీరనున్నాయి.

కాగా వివిధ ప్రాంతాల నుండి తమ రాష్ట్రానికి వస్తున్న కార్మికుల కోసం ఆరోగ్య పరీక్షలు,మరియు స్క్రీనింగ్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలు నిర్వహించిన అనంతరం అనుమానిత కార్మికులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తారు. కానీ ఇండోర్ జిల్లా నుండి వచ్చే కార్మికులకు ఈ నిర్ణయం వర్తించదు.

ఇండోర్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడ చిక్కుకున్న కార్మికులను మాత్రం తరలించరని తెలుస్తుంది. కాగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ నిర్ణయంతో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి