iDreamPost

HYD వాసులకు గుడ్ న్యూస్.. సమ్మర్‌లో నీటి కష్టాలు తీరినట్టే!

ఎండాకాలం కావడంతో తెలంగాణలో నీటి ఎద్దడి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

ఎండాకాలం కావడంతో తెలంగాణలో నీటి ఎద్దడి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

HYD వాసులకు గుడ్ న్యూస్.. సమ్మర్‌లో నీటి కష్టాలు తీరినట్టే!

ఎండా కాలం వచ్చిందంటే చాలు భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దీంతో నీటి కొరత ఏర్పడుతుంది. తెలంగాణలో ఎండ తీవ్రతకు చెరువులు, జలాశయాల్లో నీరు ఆవిరైపోతున్నాయి. భూగర్భజలాలు కూడా ఇంకిపోతున్నాయి. దీంతో తెలంగాణలో నీటి కొరత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సమస్య ఎక్కువైంది. బోర్ వాటర్ ఉన్న వారు సరే.. కేవలం మంజీర నీటి మీదనే ఆధారపడే వారి పరిస్థితి అయితే దారుణం. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవాలంటే ఒక ట్యాంకర్ కి 1000 రూపాయల నుంచి 1400 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతకు ముందు ఒక ట్యాంకర్ కి 500 రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు రేట్లు పెంచేయడంతో హైదరాబాద్ వాసులకు చుక్కలు కనబడుతున్నాయి. హైదరాబాద్ వాసులు తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కుంటున్నారు.

ఈ సమస్య హైదరాబాద్ జలమండలి దృష్టికి వెళ్లడంతో నీటి సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకుంటుంది. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కి రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా ఈ నీటిని ముందుగా అక్కంపల్లి రిజర్వాయర్ కి తరలిస్తారు. అక్కడ నుంచి కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి వెళ్లి హైదరాబాద్ కు వస్తాయి. కానీ నాగార్జున సాగర్ నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతుండడంతో నీళ్లు ఉన్న చోటనే పంపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పుట్టంగండి దగ్గర నీటిని పంపింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రోజుకు 500 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ నగరానికి సరఫరా చేయాలని అధికారులు ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.

మే 15 నుంచి ఎమర్జన్సీ పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాసుల అవసరానికి సరిపడా నీటిని అందజేస్తున్నామని అధికారులు అంటున్నారు. అవసరమైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు రిజర్వాయర్లలో ఉన్న నీళ్ళని తరలించి నీటి సరఫరా పెంచుతామని అంటున్నారు. జూన్ ఆఖరు నాటికి నగరంలో ఇక నీటి సమస్య రాకపోవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అధికారులు అంచనా నిజమైతే కనుక హైదరాబాద్ వాసుల నీటి కష్టాలు తీరినట్టే. మరి మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? మీకు నీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేక్ బానే ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి