iDreamPost

మద్యం ప్రియులకు చల్లని కబురు

మద్యం ప్రియులకు చల్లని కబురు

మూడు దశల లాక్ డౌన్ పొడిగింపు వేళ కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు చల్లని కబురు చెప్పింది. మే 4వ తేదీ నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించింది. దుకాణం వద్దకు ఒక సారి ఐదుగురు మాత్రమే రావాలని పేర్కొంది. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని కార్యకలాపాలతో పాటు మద్యం దుకాణాలు మూత పడిన విషయం తెలిసిందే. నిత్యం మద్యం సేవించేవారు ఈ 40 రోజులు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. కొంతమంది మానసిక రోగులుగా మారారు. వారందరినీ పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇతర దుకాణాలు, సాధారణ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాలు కూడా అనుమతి ఇవ్వడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి