iDreamPost

మహిళలకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు!

మహిళలకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు!

మహిళలకు బంగారం ధరల విషయంలో గుడ్‌న్యూస్‌ అందింది. వరుసగా మూడో రోజుకూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ మూడు రోజులతో కలిపి చూసుకున్నట్లయితే.. బంగారం ధరలు భారీగా తగ్గాయని చెప్పొచ్చు. నిన్న 22 క్యారెట్లపై 150 రూపాయలు 24 క్యారెట్లపై 110 రూపాయలు తగ్గింది. మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,000గా ఉండింది. ఈ రోజు 22 క్యారెట్లపై  100 రూపాయలు.. 24 క్యారెట్లపై 110 రూపాయలు తగ్గింది.

ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,890గా ఉంది.  దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,050 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,040 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 54,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర 59,890 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 55,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 60,230 ఎగబాకింది.

ఇక, వెండి ధర వరుసగా నాలుగో రోజు తగ్గింది. కిలో వెండిపై నిన్న 1500 తగ్గగా.. నేడు 1000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర 77,500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా, ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో మార్పులు వంటి ఎన్నో అంశాలు బంగారం, వెండి, ప్లానిటం వంటి వాటి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరి, వరుసగా మూడవ రోజు బంగారం, వెండి ధరలు తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి