iDreamPost

పసిడి ప్రియులకు శుభవార్త… మళ్లీ తగ్గిన ధరలు!

పసిడి ప్రియులకు శుభవార్త… మళ్లీ తగ్గిన ధరలు!

బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు మామూలైపోయాయి. రెండు రోజులు పెరుగుతూ.. మరో రెండు రోజులు తగ్గుతూ కొనాలనుకునే వారికి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల ముందు వరకు పెరుగుతూ పోయిన బంగారం ధరలు.. గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 22 క్యారెట్‌పై 150 రూపాయలు 24 క్యారెట్లపై ఏకంగా 160 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,150గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,110గా ఉండింది.

ఈ రోజు కూడా పసడి ప్రియులకు బంగార ధరల విషయంలో శుభవార్త అందింది. 22 క్యారెట్‌పై 150 రూపాయలు 24 క్యారెట్లపై 110 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం  మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,000గా ఉంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,150గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,200గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 55,300, 24 క్యారెట్ల బంగారం ధర 60,330గా ఉంది.

వెండి విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో బంగారంపై మొన్న 700 రూపాయలు తగ్గగా.. నిన్న 1000 రూపాయలు తగ్గింది. ఈ రోజు కూడా భారీగా తగ్గింది. ఏకంగా 1500 రూపాయలు తగ్గి.. కిలో వెండి మార్కెట్లో 78,500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా, ఈ బంగారం ధరలపై అదనంగా జీఎస్టీతో పాటుగా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. మరి, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి