iDreamPost

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Published Aug 10, 2023 | 8:18 AMUpdated Aug 10, 2023 | 8:18 AM
  • Published Aug 10, 2023 | 8:18 AMUpdated Aug 10, 2023 | 8:18 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు చూసి కొనాలా వద్దా అనే డైలామాలో ఉన్నారా.. అయితే మీకోసం మంచి శుభవార్త… బంగారం, వెండి ధరలు నేడు భారీగా పడిపోయాయి. క్రితం సెషన్‌ మాదిరే ఈ రోజు కూడా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు దిగి వచ్చాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న ధరలు.. ప్రస్తుతం దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు అందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పైగా త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభం కానుంది. బంగారం ధర ఇలానే దిగి వస్తే.. పసిడి అమ్మకాలు జోరందుకుంటాయి. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర దిగి వచ్చింది. క్రితం రోజు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గిన బంగారం ధర నేడు అనగా గురువారం కూడా మరోసారి రూ.110 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.100 పడిపోయి రూ. 54,950 మార్క్‌కు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ. 110 తగ్గి ప్రస్తుతం రూ. 59,950 వద్ద ట్రేడవుతోంది. ఇక నేడు ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు తులానికి రూ. 100 తగ్గి రూ. 55,100 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్‌ బంగారం రేటు రూ. 100 పడిపోయి 10 గ్రాముల రేటు రూ. 60,110 వద్ద ట్రేడవుతోంది

మరోసారి భారీగా పడిపోయిన సిల్వర్‌ రేటు..

వెండి ధర వరుసగా మూడో రోజు కూడా భారీగా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలో మీద మరో రూ. 600 తగ్గింది. ఈ మూడు రోజుల్లో కిలో వెండి రేటు ఏకంగా రూ. 1800 దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,700 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూస్తే వెండి ధర ఇవాళ మరో రూ. 500 పడిపోయింది. మొత్తంగా మూడు రోజుల్లో ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1600 తగ్గింది. ప్రస్తుతం హస్తినలో కిలో ధర రూ. 73,500 వద్ద అమ్ముడవుతోంది.

ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం ధర కుప్పకూలుతోంది. గత నాలుగు సెషన్లలోనే ఏకంగా 40 డాలర్ల వరకు పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ ఔన్స్ గోల్డ్ పై 7 డాలర్ల వరకు పతనమైంది. ఇన్నాళ్లు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన సిల్వర్ రేటు కూడా దిగివస్తోంది. ఇక నేడు గ్లోబల్‌ బులియన్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1917 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 22. 71 డాలర్లుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి