iDreamPost

ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం! వీడియో వైరల్

  • Author Soma Sekhar Published - 06:52 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 06:52 PM, Mon - 11 September 23
ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం! వీడియో వైరల్

వరల్డ్ క్రికెట్ లో గాల్లోకి ఎగిరెగిరి క్యాచ్ లు ఎవరు పడతారు అంటే.. అందరు వెంటనే జాంటీ రోడ్స్ పేరు చెబుతారు. కానీ కాలం మారుతున్న కొద్ది ప్రతీ టీమ్ లో ఓ జాంటీ రోడ్స్ లాంటి ఫీల్డర్ తయ్యారు అయ్యాడు. అయితే మీరు ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమమైన క్యాచ్ లను చూసే ఉంటారు. కానీ తాజాగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో నమోదైన రెండు క్యాచ్ లు కూడా ఔరా అనిపించేవే! అందులో ఒకటి సాంట్నర్ పట్టిన బెయిర్ స్టో క్యాచ్ అయితే.. రెండోది గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి డైవ్ చేసి పట్టిన అద్భుతమై క్యాచ్. ప్రస్తుతం ఈ రెండు క్యాచ్ ల వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ రెండు క్యాచ్ ల్లో సాంట్నర్ పట్టిన క్యాచ్ కంటే గ్లెన్ ఫిలిప్స్ డైవ్ చేస్తూ.. గాల్లోకి అమాంతం ఎగిరిపట్టిన క్యాచే హైలెట్ అని చెప్పాలి.

సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య తాజాగా రెండో వన్డే జరిగింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూస్ ప్రకారం 79 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. కివీస్ ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు ఫీల్డింగ్ కు ఫిదా అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ లో సాంట్నర్ తొలుత అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బౌల్ట్ బౌలింగ్ లో బెయిర్ స్టో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సాంట్నర్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఈ క్యాచ్ ను పట్టుకున్నాడు. ఇదే అద్భుతమైన క్యాచ్ అని అందరూ అనుకున్నారు. కానీ అంతకంటే అత్యద్భుతమైన మరో క్యాచ్ కూడా ఈ మ్యాచ్ లోనే నమోదైంది.

సౌథీ బౌలింగ్ లో మెుయిన్ అలీ భారీ షాట్ కొట్టగా.. బాల్ గాల్లోకి లేచింది. ఇక ఈ క్యాచ్ అసాధ్యం ఎవరూ పట్టరు అని అందరూ అనుకున్నారు. కానీ స్పీడ్ గా పరిగెత్తుకొచ్చిన గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి డైవ్ చేస్తూ.. క్యాచ్ ను అందుకున్నాడు. ఈ ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్ చూస్తే.. ఒళ్లుగగుర్పొడవడం ఖాయమనే చెప్పాలి. ఎంతో రిస్క్ తో కూడుకున్న ఈ క్యాచ్ పట్టే క్రమంలో కొద్దిగా అటూ.. ఇటూ అయినా ఫిలిప్స్ తీవ్రంగా గాయపడేవాడు. ఈ రెండు క్యాచ్ ల్లో ఫిలిప్స్ పట్టిన క్యాచ్ కే ఫ్యాన్స్ ఎక్కువగా ఫిదా అవుతున్నారు. ఈ క్యాచ్ పట్టిన విధానం చూసి ఫిలిప్స్ ను ప్లయింగ్ బర్డ్ తో పోలుస్తున్నారు ఫ్యాన్స్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 34 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్(95*) పరుగులతో చెలరేగడంతో జట్టు ఆ స్కోర్ సాధించింది. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. జట్టులో డారిల్ మిచెల్(57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరి పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి