iDreamPost

GMV OTT :అనుకున్న దానికంటే 2 రోజులు ముందుగా హర్రర్ కామెడీ మూవీ.. కానీ ఆ ప్లాట్ ఫార్మ్ లో కాదు..

  • Published May 06, 2024 | 1:32 PMUpdated May 06, 2024 | 1:32 PM

హర్రర్ సినిమాలంటే అందరికి భయమే.. అయితే అవే హర్రర్ సినిమాలు నవ్విస్తూ భయపెడితే.. ఆ సినిమాలు చూడడానికి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక తెలుగు సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. అదేంటో చూసేద్దాం.

హర్రర్ సినిమాలంటే అందరికి భయమే.. అయితే అవే హర్రర్ సినిమాలు నవ్విస్తూ భయపెడితే.. ఆ సినిమాలు చూడడానికి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక తెలుగు సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. అదేంటో చూసేద్దాం.

  • Published May 06, 2024 | 1:32 PMUpdated May 06, 2024 | 1:32 PM
GMV OTT :అనుకున్న దానికంటే 2 రోజులు ముందుగా హర్రర్ కామెడీ మూవీ.. కానీ ఆ ప్లాట్ ఫార్మ్ లో కాదు..

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా వరుసగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అయితే చాలా వరకు సినిమాలన్నిటికీ కూడా ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ కు ముందే వాటి వాటి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రం కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక కొన్ని అనుకోని కారణాల వలన కొన్ని సినిమాలు ముందుగా ఒక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అనుకుంటే.. ఆ తర్వాత అవి కాస్త మరొక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కు చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా మొదట అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ మారింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో.. ఎప్పటినుంచో స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం.

“గీతాంజలి మళ్ళీ వచ్చింది”. ఈ సినిమాను గీతాంజలి సినిమాకు సిక్వెల్ గా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శివ తూర్లపాటి దర్శకత్వం వహించారు, ఈ సినిమాతోనే అతను తెలుగులో పరిచయం అయ్యాడు. కాగా ఈ సినిమాలో అంజ‌లి, శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా వారి కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది నవ్విస్తూనే భయపెట్టే సినిమా అని చెప్పి తీరాలి. ఏప్రిల్ 11 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ముందుగాను అమెజాన్ ప్రైమ్ లో మే 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా వచ్చిన అప్ డేట్స్ ప్రకారం ఈ సినిమా ఆహ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు.. ఆహ ప్లాట్ ఫార్మ్ అధికారికంగా ప్రకటించింది. పైగా ఈ సినిమా అనుకున్నదానికంటే రెండు రోజులు ముందే అంటే మే 8 నుంచే ఈ సినిమా ఆహలో స్ట్రీమింగ్ కాబోతుంది.

“అక్క నువ్వు మళ్ళీ వచ్చావా.. సరే ఆహ లో కలుద్దాం”.. అనే ట్యాగ్ లైన్ తో ఆహా ప్లాట్ ఫార్మ్.. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. అయితే థియేటర్ లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోడానికి కారణం రొటీన్ కాన్సెప్ట్ , టేకింగ్ , కామెడీతో ఉండడమే అనే టాక్ నడిచింది. కానీ గీతాంజలి మొదటి పార్ట్ నచ్చిన వారికి ఈ సినిమా నాచే అవకాశం ఉంది. అందులోను థియేటర్ లో ఆకట్టుకోలేని ఎన్నో సినిమాలు ఓటీటీ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే, మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి