గౌతమ్ గంభీర్.. ఏదో ఒక కామెంట్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఎక్కువగా 2011 వరల్డ్ కప్ హీరో ధోని కాదు.. జట్టులో ఇంకా చాలా మంది ఉన్నారంటూ పదే పదే ధోనిని విమర్శిస్తుంటాడు గంభీర్. ఇక తాజాగా ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ఆడిన మ్యాచ్ లో.. ప్రేక్షకుల మధ్యలో నుంచి వెళ్తూ.. కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నా జీవితంలో సిగ్గపడే విషయం ఏంటంటే? అది క్రికెటర్ కావడమే.. అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు ఈ మాజీ క్రికెటర్, భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్. ఈ వ్యాఖ్యలతో సగటు క్రికెట్ అభిమానులు షాక్ కు గురౌతున్నారు.
13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్, రెండు వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడు, 10 వేల ఇంటర్నేషనల్ పరుగులు. ఇంతటి ఘనత సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాను క్రికెటర్ అయినందుకు సిగ్గు పడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే గంభీర్ ఈ విధంగా కామెంట్ ఎందుకు చేశాడో ఎవరికీ తెలీదు. తాజాగా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ గంభీర్ ఈ సంచలన కామెంట్ చేశాడు. దీంతో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ గంభీర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడా? అని ఆలోచిస్తున్నారు. కాగా.. 2007 టీ20 వరల్డ్ కప్ తో పాటుగా, 2011 ప్రపంచ కప్ లు టీమిండియా గెలవడంలో గౌతమ్ గంభీర్ ది కీలకపాత్ర. అయితే ఈ రెండు వరల్డ్ కప్ ఘనత మహేంద్ర సింగ్ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో అప్పటి నుంచి గంభీర్ ధోనిని విమర్శిస్తూ వస్తున్నాడని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
అదీకాక విరాట్ కు గంభీర్ కు కూడా గొడవలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆసియా కప్ లో టీమిండియా ఆడిన మ్యాచ్ లో ప్రేక్షకుల మధ్యలో నుంచి వెళ్తూ.. కోహ్లీ కోహ్లీ.. అని అరుస్తున్న ఫ్యాన్స్ కు తన మిడిల్ ఫింగర్ చూపించి వెళ్లిపోయాడు గంభీర్. ఈ వీడియో వైరల్ కావడంతో.. అతడిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను క్రికెటర్ అయినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir regrets being a cricketer. pic.twitter.com/GSjoMNM7bI
— CricTracker (@Cricketracker) September 6, 2023