iDreamPost

ఆ పని ధోనీకి వదిలేసి తప్పు చేశా.. ఛాన్స్ వస్తే సరిదిద్దుకుంటా: గంభీర్

  • Published Jun 22, 2024 | 5:52 PMUpdated Jun 22, 2024 | 5:52 PM

భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నానుతున్నాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​కు మెంటార్​గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్​గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నానుతున్నాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​కు మెంటార్​గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్​గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

  • Published Jun 22, 2024 | 5:52 PMUpdated Jun 22, 2024 | 5:52 PM
ఆ పని ధోనీకి వదిలేసి తప్పు చేశా.. ఛాన్స్ వస్తే సరిదిద్దుకుంటా: గంభీర్

భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య బాగా వార్తల్లో నానుతున్నాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​కు మెంటార్​గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్​గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మెన్ ఇన్ బ్లూ ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అతడు త్వరలో బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. పొట్టి కప్పు పూర్తయిన వెంటనే అతడు టీమ్​ను వీడనున్నాడు. దీంతో కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టిన భారత క్రికెట్ బోర్డు.. రీసెంట్​గా ఆ పోస్ట్ కోసం పలువుర్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో గంభీర్ కూడా ఉన్నాడు. గౌతీ ఇంటర్వ్యూ సక్సెస్​ఫుల్​గా ముగిసింది. త్వరలో కోచ్​గా అతడి పేరును అధికారికంగా ప్రకటించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్, తన కెరీర్ తదితర విషయాలపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్ పదవి గురించి ఇప్పుడు సమాధానం చెప్పడం కష్టమన్నాడు. ఐపీఎల్​లో కేకేఆర్​తో అద్భుతమైన ప్రయాణాన్ని ముగించుకొని హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు భారత కోచింగ్ గురించి అంతగా ఆలోచించడం లేదంటూ జవాబు దాటవేశాడు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచ కప్-2011 గురించి కూడా గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టోర్నీ ఫైనల్​లో ఎంఎస్ ధోనీకి ఆ పనిని వదిలేసి తప్పు చేశానని చెప్పాడు. ‘వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్​ను నేను ముగించాల్సింది. టీమ్​ను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాదే. మ్యాచ్​ను ఫినిష్ చేసే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకుండా నేనే ఆ పని పూర్తి చేయాల్సింది. ఒకవేళ కాలాన్ని గిర్రున తిప్పే ఛాన్స్ వస్తే నేను వెనక్కి వెళ్లి ఆ వర్క్ పూర్తి చేసొస్తా. ఆ మ్యాచ్​లో లాస్ట్ రన్​ను కంప్లీట్ చేసి వచ్చేస్తా. ఆ మ్యాచ్​లో నేను ఎన్ని పరుగులు చేశాననేది కాదు.. ఆఖరి పరుగు పూర్తి చేశానా? లేదా? అనేదే ముఖ్యం’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్​లో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్​లో గంభీర్ 97 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 91 పరుగులు చేయడం, ఆఖర్లో విన్నింగ్ సిక్స్ కొట్టడంతో ఎక్కువ క్రెడిట్ ధోని ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా పైకామెంట్స్ చేయడం గమనార్హం. ఇక, కోచింగ్ గురించి మాట్లాడుతూ.. వ్యక్తుల కంటే టీమ్​ను ముందుంచాలనే ఐడియాతోనే తాను ముందుకు వెళ్తానని పేర్కొన్నాడు గౌతీ. ఇలాంటి ఆలోచనతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా రిజల్ట్ అనుకూలంగా వస్తుందన్నాడు. కోచ్​గా జట్టులోని 11 మంది ఆటగాళ్లను ఒకేలా చూడాలన్నదే తన పాలసీ అని చెప్పాడు. అందరికీ సమానంగా రెస్పెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం మంచిదన్నాడు. అప్పుడే అద్భుత విజయాలు అందుకోగలమని గంభీర్ వివరించాడు. మరి.. వరల్డ్ కప్ ఫైనల్​లో ధోనీకి ఆ పని వదిలేసి తప్పు చేశానంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి