iDreamPost
android-app
ios-app

ఇదుంటే ఐరన్ బాక్స్, టేబుల్ అవసరం లేదు.. బట్టలు ఫాస్ట్‌గా ఇస్త్రీ అవుతాయి

Garment Steamer: ఈ ఒక్క ప్రాడెక్ట్ ఉంటే టేబుల్ అవసరం లేదు. ఐరన్ బాక్స్ అవసరం లేదు. మామూలుగా మిగతా వాళ్ళు ఇస్త్రీ చేయాలంటే టేబుల్ వేయాలి. దాని మీద దుప్పటి వేయాలి. అప్పుడు బట్టలు ఇస్త్రీ చేయాలి. అదే ఈ ప్రాడెక్ట్ ఉంటే హ్యాంగర్ కున్న బట్టని అలానే ఉంచి ఇస్త్రీ చేసేయచ్చు.

Garment Steamer: ఈ ఒక్క ప్రాడెక్ట్ ఉంటే టేబుల్ అవసరం లేదు. ఐరన్ బాక్స్ అవసరం లేదు. మామూలుగా మిగతా వాళ్ళు ఇస్త్రీ చేయాలంటే టేబుల్ వేయాలి. దాని మీద దుప్పటి వేయాలి. అప్పుడు బట్టలు ఇస్త్రీ చేయాలి. అదే ఈ ప్రాడెక్ట్ ఉంటే హ్యాంగర్ కున్న బట్టని అలానే ఉంచి ఇస్త్రీ చేసేయచ్చు.

ఇదుంటే ఐరన్ బాక్స్, టేబుల్ అవసరం లేదు.. బట్టలు ఫాస్ట్‌గా ఇస్త్రీ అవుతాయి

ఒకప్పుడు అంటే బొగ్గుల ఇస్త్రీ పెట్టెలు ఉండేవి. బొగ్గు వేసుకుని.. బట్ట మీద కొంచెం నీటి చుక్కలు జల్లి ఇస్త్రీ చేస్తే బాగా నలిగి మడతలు లేకుండా నీట్ గా వచ్చేవి. ఇప్పుడు వచ్చే ఐరన్ బాక్స్ లు అంత గొప్పగా ఏం ఉండడం లేదు. బరువు లేకపోవడం వల్ల బట్టల మీద మడతలు త్వరగా పోవడం లేదు. ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ అనేది సమయం ఎక్కువ పడుతుంది. త్వరగా నలగవు. పైగా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కూడా కుదరదు. స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అదే ఇప్పుడు చెప్పబోయే గార్మెంట్ స్టీమర్ మాత్రం చాలా లైట్ వెయిట్ తో ఉంటుంది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్ళచ్చు. బ్యాగ్ లో కూడా తక్కువ స్పేస్ లో ఇమిడిపోతుంది. సూట్ కేస్, చిన్న చిన్న బ్యాగ్స్ లో కూడా సులువుగా తీసుకెళ్ళచ్చు. పైగా దీనికి టేబుల్ అవసరం లేదు.

మామూలు ఐరన్ బాక్స్ లతో ఇస్త్రీ చేయాలంటే ఖచ్చితంగా టేబుల్ ఉండాలి. అదే ఈ గార్మెంట్ స్టీమర్ తో అయితే బట్టలను తీగ మీద వేలాడుతూ ఉండగా కూడా ఇస్త్రీ చేసుకోవచ్చు. చొక్కా మీద గానీ ప్యాంటు మీద గానీ చిన్న చిన్న ముడతలు ఉన్నా సరే దీనితో ఈజీగా ఇస్త్రీ చేసుకోవచ్చు. నిలువుగా, అడ్డంగా ఎలా అయినా సరే ఇస్త్రీ చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇందులో 250 ఎంఎల్ సైజులో చిన్న వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ నీరు ఉండడం వల్ల అది ఆవిరిగా మారి వేడి ఆవిరితో బట్టలు ఇస్త్రీ అవుతాయి. టేబుల్ మీద బట్టలు పెట్టే పని లేకుండా దండెం మీద ఆరేసి ఉన్నప్పుడే ఇస్త్రీ చేసుకోవచ్చు. లేదా ఒంటి మీద వేసుకుని కూడా ఇస్త్రీ చేసుకోవచ్చు. వాటర్ తో ఇస్త్రీ అవసరం లేదనుకుంటే వాటర్ ట్యాంక్ ని బయటకు తీసేయచ్చు. 250 ఎంఎల్ వాటర్ తో కనీసం 10 నిమిషాల పాటు అయినా ఇస్త్రీ చేసుకోవచ్చు. ఇది చూడ్డానికి హెయిర్ డ్రయ్యర్ సైజులో ఉంటుంది. కానీ చాలా బాగా పని చేస్తుంది.

బట్టలను టేబుల్ మీద పెట్టి నిలుచుని ఎక్కువ సేపు చేస్తే నడుము నొప్పి వస్తుంది. అలాంటి వారికి ఈ గార్మెంట్ స్టీమర్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. బట్టలను మంచం మీద వేసి పాటలు పాడుకుంటూ జాలీగా ఇస్త్రీ చేసుకోవచ్చు. హ్యాంగర్ కి తగిలించి కూడా ఇస్త్రీ చేసుకోవచ్చు. ఒకే చోట ఉండాలి అని నిబంధన లేకుండా ఎలా కావాలంటే అలా కన్వీనెంట్ గా, కంఫర్ట్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. గుడ్స్కిటీ కంపెనీకి చెందిన ఈ స్టీమర్.. 1200 వాట్ సామర్థ్యంతో వస్తుంది. 30 సెకండ్లలోనే ఇది ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుంది. దీని వల్ల ఇస్త్రీ త్వరగా అవుతుంది. దీని మీద ఏడాది వారంటీ వస్తుంది. ఆన్ లైన్ లో దీనికి 4.2 రేటింగ్ ఉంది. దీంతో కర్టెన్లు, కోట్లు, బెడ్ షీట్లు, తలగడ గలేబీలు, సాఫ్ట్ టాయ్స్ వంటివి ఐరన్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 4,500గా ఉంది. 51 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,199కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. మీకు కనుక ఈ గార్మెంట్ స్టీమర్ ఐరన్ కావాలనుకుంటే గనుక ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి