iDreamPost

భారత్‌-పాక్‌ మధ్య సరికొత్త సిరీస్‌కు ప్లానింగ్‌!

  • Author Soma Sekhar Published - 12:19 PM, Wed - 4 October 23
  • Author Soma Sekhar Published - 12:19 PM, Wed - 4 October 23
భారత్‌-పాక్‌ మధ్య సరికొత్త సిరీస్‌కు ప్లానింగ్‌!

ఇండియా-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు గుర్తుందా? ఇరు దేశాల మధ్య సిరీస్ లు రద్దు అయ్యి దాదాపు 10 ఏళ్లు దాటింది. చివరిసారిగా ఇండియా-పాక్ 2012-13లో తలపడ్డాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. అయితే అప్పుడప్పుడు ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే పీసీబీ చీఫ్ జాకా ఆష్రఫ్ బీసీసీఐ ముందు ఓ విన్నపం ఉంచారు. భారత్‌-పాక్‌ మధ్య సరికొత్త సిరీస్‌కు ప్లానింగ్‌ కు చేద్దామన్నట్లుగా చెప్పుకొచ్చాడు జాకా అష్రఫ్. ఈ సిరీస్ కు గాంధీ-జిన్నా అనే పేరును కూడా సూచించాడు.

ఇండియా-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి దాదాపు 10 ఏళ్లు దాటింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సిరీస్ లు జరగడం లేదు. ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తుండటంతో.. దాయాది దేశాల మధ్య టెస్ట్ సిరీస్ కూడా నిర్వహించడానికి అవకాశం లేకుండా పోతోంది. చివరిగా ఇండియా-పాక్ లు 2007లో జరిగిన టెస్ట్ సిరీస్ లో తలపడ్డాయి. కాగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య టెస్ట్ సిరీస్ జరగడం అసాధ్యమనే చెప్పాలి. అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ జాకా అష్రఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇండియా-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణ గురించి జాకా అష్రఫ్ మాట్లాడుతూ..”ఇండియా-పాక్ మ్యాచ్ లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ సిరీస్ జరిగితే.. యాషెస్ సిరీస్ కూడా చిన్నదిగా మారిపోతోంది. ఇప్పటికే బీసీసీఐ ముందు గాంధీ-జిన్నా ట్రోఫీ పేరుతో ఓ సిరీస్ నిర్వహిద్దామని ప్రపోజల్ కూడా పెట్టాను” అంటూ చెప్పుకొచ్చాడు పీసీబీ చీఫ్. గాంధీ-జిన్నా సిరీస్ ను ఓ సంవత్సరం ఇండియాలో, మరో సంవత్సరం నిర్వహించాలని కోరినట్లు జాకా అష్రఫ్ పేర్కొన్నాడు.

కాగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్ ప్రాణం పోసుకోవడం కష్టమే. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీకి పాక్ లో అడుగుపెట్టని భారత్.. ఈ సిరీస్ కు ఓకే చెబుతుందా? అంటే సమాధానం కాదనే వస్తుంది. అదీకాక 2025లో పాక్ లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక కూడా మారే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి గాంధీ-జిన్నా సిరీస్ ప్లానింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి